కొవిడ్ సర్టిఫికెట్ లో కూడా సవరణలు చేయవచ్చా..?
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలందరినీ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ?ఎవరి నుంచి? ఎక్కడి నుంచి? మనల్ని వైరస్ చుట్టుముడుతుందోనని ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వాలు 45 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక అందుకు తగ్గట్లుగానే 45 సంవత్సరాలు పైబడిన వారికి మొదటి , రెండవ డోస్ లను కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల మరోసారి 18 సంవత్సరాలు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
మరి కొంతమంది బయట డబ్బులు వెచ్చించి మరీ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఎవరైతే విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో అలాంటి వారు రెండు డోస్ లను వేయించుకున్న తరువాత విదేశాలకు వెళ్లడం జరుగుతోంది. ఫలానా వారు కోవిన్ వ్యాక్సిన్ చేయించుకున్నారా ?లేదా ?అని తెలుసుకునేందుకు వీలుగా కూడా కొవిన్ సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరుగుతోంది. అయితే ఏదో ఏమరుపాటునో లేక తప్పు బయోడేటా వంటివి ఈ సర్టిఫికెట్ లో పడడం వల్ల కొంత మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు సర్టిఫికెట్ లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
అయితే తప్పులను కొవిన్ పోర్టల్ ద్వారా సవరించుకోవచ్చు. ఎవరైతే అనుకోకుండా తప్పులు చేస్తారు అలాంటివారు కొవిన్ సర్టిఫికెట్ లలో లింగము ,పేరు, పుట్టిన తేదీ , నివాస స్థలము లాంటివి సవరించుకోవచ్చు అని ఆరోగ్య సేతు తన అధికారిక వెబ్సైట్ ద్వారా ట్విట్టర్లో తెలిపింది. కొవిన్ పోర్టల్ లో .. cowin.gov.in ద్వారా తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా ఆరోగ్య సేతు యాప్ లో " రైజ్ ఏ ఇష్యూ " అనే ఒక ప్రత్యేకమైన ఆప్షన్ ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది. ఇక ఈ ఆప్షన్ ద్వారా కొవిన్ సర్టిఫికెట్ లో ఉన్న తప్పులను సరిదిద్దుకోవచ్చు.
ఈ సర్టిఫికెట్.. మనం దూర ప్రయాణాలలో, విదేశీ ప్రయాణాలలోనూ మరే ఇతర సందర్భాలలో మనకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. అంతేకాదు మీరు విదేశాలకు వెళ్లాలంటే మాత్రం కంపల్సరిగా ఈ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే.