సోనుసూద్ ను కలవడానికి 700 కి.మీ నడక

Chandu
కరోనా విపత్కర పరిస్థితుల్లో నిత్యం సామాజిక సేవ చేస్తూ రియల్ హీరో గా సోనుసూద్ పేరు తెచ్చుకున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి వేలాది మందిని సోను ఆదుకున్నాడు. సొంతంగా బస్సులు ఏర్పాటు చేసి వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాడు. మరికొందరి కోసం ఏకంగా విమానాన్నే ఏర్పాటు చేశాడు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవలో మానవత్వాన్ని పంచాడు. సాయం కావాలి సర్ అని అడగగానే క్షణాల్లో తీర్చి.. ప్రత్యక్ష దేవుడిలా ప్రజల మన్ననలు పొందాడు. సిగ్నల్ సమస్య వుండడంతో ఆన్లైన్ క్లాస్ లు వినడానికి మారుమూల గ్రామం లోని ఓ చిన్నారి ఇబ్బందులు పడుతున్నది అని తెల్సుకుని.. గంటల వ్యవధి లోనే ఏకంగా ఆ ఊరిలో సోను సెల్ఫోన్ టవర్ నే నిర్మించాడు. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఏకంగా ప్లాంట్లనే ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాడు.

కరోనా కల్లోల సమయంలో కూడా మీకు నేను అండగా వున్నాను.. అధైర్య పడకండి అంటూ జనాలకు భోరోస ఇస్తున్న రియల్ హీరో ను కలవడానికి హైదరాబాద్ యువకుడు సాహసమే చేశాడు. ఏకంగా 700 కిలోమీటర్లు నడిచి సోనూసూద్ ను కలిశాడు.. ఫైనాన్స్ చెల్లించక పోవడంతో తన తండ్రి ఆటోని ఫైనాన్స్ వాళ్ళు లాక్కెళ్లిన విషయం... తల్లి మరణంతో ఒంటరైన తమ జీవితాలకు భరోసా ఇవ్వాలని సోను సూద్ దృష్టికి తీసుకెల్లే ప్రయత్నం చేశాడు.

 హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్ అనే యువకుడు సోనూసూద్ ని కలవడానికి గత నెలలో హైదరాబాద్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాడు. నా లక్ష్యం నా దేవుడిని కలవడం అంటూ నడక సాగించాడు. 700 కిలోమీటర్ల సుదీర్ఘ నడక ప్రయాణం తర్వాత హీరో నీ కలిసి తన అభిమానాన్ని చాటాడు. తాను ఇంత సాహసం చేయడానికి గల కారణాలను సోనుకి చెప్పాడు. కాగా తనను కలవడానికి ఇలాంటి సాహసాలు ఎవరూ చేయకండి అంటూ సోనూసూద్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: