సత్య నాదెళ్ల జీవితంలో మనసు కరిగే కష్టాలు..!
సత్య నాదెళ్ల.. గత ఎనిమిది సంవత్సరాలుగా (2014) మైక్రోసాఫ్ట్ సీఈవోగా కొనసాగుతున్న తెలుగుతేజం. అంతేకాదు ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మొదటి స్థానానికి చేరుకున్నారు. ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2019 జాబితాలో, ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్న ఏకైక భారతీయ సంతతిగా రికార్డు సృష్టించారు. ఇక అంతే కాదు గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో, చోటు దక్కించుకున్న సత్య నాదెళ్ల తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా మెరుగుపరుచుకుంటున్నారు.
సత్య నాదెళ్ల.. ఐఏఎస్ అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ అలాగే ప్రభావతి యుగంధర్ లకు 1967 లో జన్మించారు. ఇక ఈయనకు ఒక చెల్లి కూడా ఉండేది. కానీ ఆమె సత్య ఐదు సంవత్సరాల వయసులో మరణించడంతో, సత్య కొన్ని సంవత్సరాల పాటు కోలుకోలేకపోయారు.. ఇక సత్య తన చెల్లెలు లేదన్న బాధ నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా, ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ మైక్రోసాఫ్ట్ సీఈవో గా ఎదిగారు. ఇక సత్య 1992లో మైక్రోసాఫ్ట్ లోకి ప్రవేశించారు. ఇక అదే సంవత్సరంలోనే మరో ఐఏఎస్ అధికారి కూతురు,తన చిన్న నాటి స్నేహితురాలు అయిన అనుపమ ను 1992 లో వివాహం చేసుకున్నారు.
సత్య వాళ్ళింటికి ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు వచ్చేవారు. ఇక వారు సత్య కొడుకు జైన్ పరిస్థితిని అర్థం చేసుకొని, ఒక సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. అదే "Seeing AI "అనే ఆండ్రాయిడ్ యాప్ ద్వారా డిసబులిటీ తో బాధపడుతున్న వ్యక్తికి తన ముందు జరగబోయే విషయాలన్నీ,ఆ యాప్ చక్కగా వివరిస్తుంది. వివరించడమే కాకుండా ముందున్న వ్యక్తి భావాలను కూడా వ్యక్తీకరిస్తుంది. ఇక మన చుట్టూ ఉన్న పరిస్థితులను కంటికి కట్టినట్టు చూపించడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్న వారికి చక్కటి అనుభూతిని అందించడానికి కారణం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లే కారణమని చెబుతూ ఉంటారు సత్య నాదెళ్ల.