కస్టమర్లను బురిడీ కొట్టించిన పండ్ల వ్యాపారి.. వీడియో వైరల్
అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఇంక ఆలస్యం ఎందుకు ఒకసారి ఆ వీడియో పై లుక్ వేసుకోండి. కొనుగోలు దారులను ఎలా మోసం చేస్తాడో ఇక్కడ కళ్ళకు కట్టినట్లు చూడొచ్చు. మాములుగా ఎవరైనా కూడా ఫ్రెష్ గా ఉండే కూరగాయలను, పండ్లను కొనాలని అనుకుంటారు. వాటిని వెతికి మరి తూకం వేయించుకుంటారు. అయితే, అక్కడే వ్యాపారులు కూడా మోసాలకు పాల్పడుతారు.
ఈవీడియో లో కూడా అలాగే తనకు నచ్చిన మామిడి పండ్ల ను మంచివి ఏరుకొని తూకం వేయించుకొనేందు కు ఇస్తాడు. కానీ, ఆ పండ్ల వ్యాపారి మాత్రం అతడు ఏరుకున్న పండ్ల ను పక్కన పెట్టి నాసిరకం పండ్లను కస్టమర్ కు ఇస్తాడు. అది గమనించని వినియోగదారుడు వాటిని అలానే తీసుకెళ్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అతని తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. వినియోదారుల ను మోసం చేస్తున్న విధానం చూసిన నెటిజన్లు ఇలాంటి మండిపడుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల తో జనాలు అప్రమత్తంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూసెయ్యండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి జరగడం సహజం..