అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. అంటే ఇదేనేమో?

praveen
కరోనా వచ్చిన తర్వాత.. ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.  ఎంతోమంది అంచనాలను తలకిందులు చేసింది కరోనా. ముఖ్యంగా జనాలు ఒకప్పుడు అనుకునేవారు.. బాగా డబ్బు సంపాదించి  ఉన్నతమైన హోదాలో బ్రతకాలి అనుకునే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం.. డబ్బు బంగ్లాలు కాదు..  గొంతులో ప్రాణం ఉంటే చాలు కాస్త సంతోషంగా బతికితే చాలు అని అనుకుంటున్నారు. నేటి రోజుల్లో బ్రతకడమే కష్టం అయినప్పుడు డబ్బు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అని అనుకుంటున్నారు జనాలు.


 ఇలా ఎంతోమంది అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టించింది.  అంతేకాదు ఏకంగా దూసుకుపోతున్న టెక్నాలజీ రంగాన్ని కూడా కుదిపేసింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు ఎన్నో ఊహించుకున్నారు.  మరో 20 ఏళ్లలోపు టెక్నాలజీలో సమూలంగా మార్పులు తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఏం చేస్తాం ఇక వారి అంచనాలకు కళ్లెం వేసింది కరోనా.  ఒకప్పుడైతే ఏకంగా కార్లనే ఎగిరే ఫ్లైట్ లాగా తయారు చేయాలి అనుకున్నారూ శాస్త్రవేత్తలు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అని అంటూ ఉంటారు కదా.. ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది.



 ఇక 2020 సంవత్సరం లో కార్లు గాల్లో ఎగరడం కాదు.. గాల్లో ఎగిరే విమానాలే చివరికి  కార్ల లాగా భూమికే పరిమితం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక ఇటీవలే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక ఫొటోస్ వైరల్ గా మారిపోయింది.  2000 సంవత్సరంలో ఇక 2020 సంవత్సరం వచ్చేసరికి అందరం గాల్లో ఎగిరే కార్లలో తిరుగుతూ అని అనుకున్నారు. కానీ తీరా 2020 సంవత్సరం లోకి వచ్చేసరికి గాల్లో ఎగిరే విమానాలు సైతం ఎగర లేని పరిస్థితిలో ఉన్నాయి అని తెలిపే ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ ఫోటో  చూసి నెటిజన్లు అవును నిజమే.. భలే చెప్పావ్ గురు అంటూ భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: