సూర్యుడిని సరికొత్తగా చూపించిన నాసా..
ఎంతో పెద్ద విస్తీర్ణం కలిగి ఉండి , పసుపు నారింజ రంగులో కనిపించే సూర్యుడికి బదులుగా చాలా చిన్న వస్తువు వలె సిల్హౌట్లో కనిపిస్తోందని ఐఎస్ఎస్ వెల్లడించింది. ఇక అంతే కాకుండా ఐఎస్ఎస్ ఏడు వేరు వేరు సమయాలలో సూర్యుని నుంచి తీసుకున్న ఫోటోలను నాసా తో పంచుకుంది. ఇక ఈ ఫోటో లను స్వాధీనం చేసుకున్న నాసా ఒక మిశ్రమ చిత్రాన్ని సృష్టించింది. ఐఎస్ఎస్ భూమి నుంచి 410 కిలోమీటర్ల దూరంలో సెకండ్ కి సుమారు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపింది.
ఇక ఈ చిత్రం వర్జీనియాకు దగ్గర్లో ఉన్న ఒక ప్రదేశం నుండి తీసుకున్నట్లు, అలాగే అంతరిక్షంలో ఒక వస్తువు ముందు మరొక వస్తువు దాటినప్పుడు ఆ సందర్భం ఎలా ఉంటుంది అనే దానిని చక్కగా చూపించారు. ముఖ్యంగా ఇద్దరు వ్యోమగాములు షేన్ కింబ్రో అలాగే థామస్ పెస్క్వెట్ , ఇక వీరిద్దరూ సౌర శ్రేణిలో కొత్త రోల్ అవుట్ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే స్పేస్ వాక్ 6 గంటల 45 నిమిషాల పాటు కొనసాగిందని సమాచారం. ఒక చిన్న వస్తువు వలె కనిపించిన సూర్యుడి ఫోటోలు నాసా తన అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ,వెంటనే ఆరు లక్షలకు పైగా లైకులు రావడంతోపాటు అందంగా, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అంటూ ఇన్స్టాగ్రామ్ యూజర్లు కూడా తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు.
ఇక అంతే కాదు పలువురు ప్రముఖులు కూడా నమ్మశక్యం కాని, ఒక అందమైన ఫోటో ఇది.అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది అంటూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.