వావ్ : బాత'మ్మ' దాగుడుమూతలు.. !
ఈ వీడియో ఒక నీటి సరస్సులో ఒక బాతు కుటుంబం కలిసి సరదాగా ఆడుకుంటూ ఉండగా ఎవరో తమ కెమెరాకు పని చెప్పి ఆ వీడియోను అంతర్జాలంలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో వైరల్ గా మరి ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో నిడివి 24 సెకన్లు మాత్రమే ఉంది. ఈ వీడియోలో మనము బాగా గమనిస్తే తల్లి బాతు, తన బిడ్డలైన పిల్ల బాతులను సంతోషపరచడానికి తాను నీటిలో రరకాలుగా విన్యాసాలు చేస్తోంది. తల్లి బాతు నీటిలో ఎగిరి దూకుతోంది ఇది చూసిన పిల్ల బాతులు హ్యాపీగా ఉన్నాయి. ఈ వీడియోను చూసిన వీక్షకులు వారి భావనలను రకరకాలుగా పంచుకుంటున్నారు.
తల్లి బాతు పిల్లలకు ఎలా జీవించాలో నేర్పుతోంది. నీటి యొక్క లోతును చూపిస్తూనే జీవితంలో కష్టాలుంటాయని తెలిసేలా చేస్తోంది. చెరువులోని నీటి లోతులగా అక్కడక్కడా కష్టాలు బాధలు ఎదురవుతాయని, వాటన్నింటినీ ఆనందంగా ఎదుర్కొని పైకి రావాలని చెప్పకనే చెబుతోంది. ఇలా పిల్ల బాతులకు జీవిత పాఠం నేర్పుతోంది. ఎలాగయితే మానవుని జీవితంలో ఒక తల్లి తన బిడ్డలకు అన్నింటినీ నేర్పుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తుందో అదే విధంగా ఈ బాతు కూడా పిల్లలకు ఒక మార్గాన్ని చూపిస్తోంది. ఈ వీడియో ను చూసిన చాలా మంది చాలా ముచ్చటగా ఉందంటూ ట్వీట్ లు చేస్తున్నారు. ఈ వీడియోను బ్యూటెంగేబీడెన్ అనే ట్విట్టర్ ఖాతాదారు పోస్ట్ చేయడం జరిగింది.