పోలీస్ ఇంట్లోనే దొంగతనం.. లెటర్ రాసి మరి...

Purushottham Vinay
ఓ దొంగ ఏకంగా పోలీస్ ఇంట్లోనే దొంగతనం చేశాడు. ఇంట్లో వుండే బంగారం, వెండి నగలు, వస్తువులు అన్ని ఎత్తుకెళ్లాడు ఆ దొంగ.ఇక ఆ దొంగ పోతూ పోతూ ఓ లెటర్ కూడా రాసి పెట్టాడు. ఇక ఆ లెటర్లో దొంగ ఏమని రాశాడంటే..‘సార్ ... నాకు ఈ దొంగ‌త‌నం చాలా అవసరం. ఇక నేనిప్పుడు ఈ దొంగ తనం చేయకుంటే నా స్నేహితుడి ప్రాణాలు పోతాయి.అందుకే ఈ దొంగ తనం త‌ప్ప‌డం లేదు. సారీ సార్’ అంటూ ఓ లెటర్ ను తాను దొంగ‌త‌నం చేసిన ఇంట్లో వ‌దిలి వెళ్ళాడు ఆ దొంగ‌. అది కూడా ఓ పోలీసు ఇంట్లో దొంగ‌త‌నం చేసి ఈ లెట‌ర్ వ‌దిలివెళ్ళ‌డం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బింద్ న‌గ‌రంలో చోటు చేసుకుంది. ఇక ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ప‌నిచేస్తున్న ఓ పోలీసు ఉద్యోగి ఫ్యామిలీ బింద్ అనే న‌గ‌రంలో నివాసం ఉంటోంది.

ఉద్యోగ‌రీత్యా ఆ అధికారి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఉంటుండ‌గా భార్యా పిల్ల‌లు మాత్రం బింద్ న‌గ‌రంలో వుంటున్నారు. ఇక జూన్ 30 వ తేదీన భార్యా పిల్ల‌లు ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరికి వెళ్లారు. అయితే వారు తిరిగి వ‌చ్చేసరికి ఆ ఇంటి తాళాలు ప‌గల‌గొట్టి ఉన్నాయి. అలాగే ఆ ఇంట్లో సామాన్లు అన్నీ కూడా ఎలా పడితే అలా ప‌డి ఉన్నాయి.ఇంట్లో వున్న విలువైన వ‌స్తువుల‌ను దొంగిలించిన ఆ దొంగ.. ఓ క్షమాపణ లెటర్ ని కూడా వ‌దిలి వెళ్ళాడు. త‌న మిత్రుడి ప్రాణం కాపాడ‌టానికి అనివార్యంగా ఈ దొంగ‌త‌నం చేస్తున్నాన‌ని అందులో రాశాడు.ఇక త్వ‌ర‌లో డ‌బ్బు రాగానే దొంగ‌త‌నం చేసిన ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తానంటూ అందులో రాశాడు.ఇక ఈ ఘటనపై బింద్ న‌గ‌ర పోలీసులు కేసును న‌మోదు చేశారు. ఇంకా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగ‌త‌నంలో తెలిసిన వారి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: