మనం ప్రతిరోజు అనేక వస్తువులను వాడుతూ ఉంటాము. అందులో కొన్ని వస్తువులు మాత్రమే తెలుసు మనకి. ఆ వస్తువుల మీద కొన్ని కలర్స్, సింబల్స్ వంటివి కూడా ఉంటాయి. అటువంటి గుర్తులను మనం ఎక్కువగా పట్టించుకోము. అయితే ఇప్పుడు అందులో కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం.
1) టూత్ పేస్ట్:
టూత్ పేస్ట్ ను మనం ప్రతిరోజు పళ్లను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించుకుంటాం. అందులోని టూత్ పేస్ట్ చివర ఒక రంగు కలర్ పూసి ఉంటారు. ఆ కలర్ గుర్తులను తెలుసుకుందాం.
బ్లూ కలర్:
నాచురల్ మెడిసిన్ గా ఉపయోగపడుతుంది.
గ్రీన్ కలర్:
ఇది అన్ని ఆయుర్వేద ఉత్పత్తులతో తయారు చేయబడినది.
రెడ్ కలర్:
ఇది నేచురల్ అలాగే కెమికల్ ఉత్పత్తులతో తయారు చేయబడినది.
బ్లాక్ కలర్:
ఇది ఓన్లీ కెమికల్ తో తయారు చేయబడినది.
2). మంకీ క్యాప్ మీద బాలు లాంటిది:
ఈ మంకీ క్యాప్ వేసుకొని ఎప్పుడైనా బోటులో ప్రయాణం చేస్తున్నప్పుడు, బైక్ మీద వేగంగా వెలుతున్నప్పుడు దెబ్బ తగలకుండా పైన మెత్తని బాల్ మాదిరిగా అమరుస్తారు.
3). హెడ్ ఫోన్స్:
హెడ్ ఫోన్స్ ను మనం గమనించినట్లైతే ఒక్కటీ లేదా అంతకంటే ఎక్కువ రింగులు ఉండేది చూసి ఉంటాం .ఆ రింగులు ఎందుకోసం అంటే.
1) ఒక రింగు:
ఒక రింగు ఉంటే 2 హెడ్ ఫోన్స్ లలో ఒకేరకమైన సౌండ్ వినపడుతుంది.
2) రెండు రింగులు:
రెండు రింగులు కలిగి ఉంటే, ఎడమ, కుడి వైపున వేరు వేరు సౌండ్ వినపడుతుంది.
3). మూడు రింగులు:
మూడు రింగులు ఉంటే మైక్రోఫోన్ కూడా పనిచేస్తుంది అని అర్థం.
3). జీన్స్ ప్యాంట్ ల పైన ఉండే చిన్న జోబులు ఎందుకు ఉపయోగిస్తారు అంటే.. 1900 శతాబ్దంలో ఎక్కువగా ప్యాంట్ వాచ్ లు ఉండేవి. దానికి అనుగుణంగానే ఈ ప్యాంట్ ను తయారు చేసేవారు. కానీ ఇది ఇప్పుడు కూడా ట్రెండింగ్ గా మారింది.
4). కార్లలో పెట్రోల్ సింబల్ గుర్తు:
మనము ఏదైనా కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. కార్ పెట్రోల్ క్యాప్ ఎటు వైపు ఉందో తెలుసుకోవాలంటే, ఈ సింబల్ ఎటువైపు చూపిస్తే అటు వైపు ఉన్నట్లు గుర్తు అట.
5). న్యూస్ పేపర్లో నాలుగు చుక్కలు:
సాధారణంగా ప్రతి రోజూ మనం చదివే న్యూస్ పేపర్ లో కింద నాలుగు రంగులు కలిగిన చుక్కలు మనకు దర్శనమిస్తుంటాయి. 4 చుక్కలు కలిగిన రంగులను CMYK అని అంటారు. ఇక పేపర్ లు ముద్రించేటప్పుడు రంగులు పేపర్ లో రావాలి కాబట్టి, ఈ నాలుగు రంగులను కలిపి ఒక అలైన్మెంట్ ఇవ్వడం ద్వారా పేపర్ కు కావలసిన చక్కని రంగు మనకు అందుతుంది. ముఖ్యంగా ఈ నాలుగు రంగులు కలిపి లక్షల్లో రంగులను సృష్టిస్తాయి కాబట్టి ఈ నాలుగు రంగులను ఉపయోగించడం గమనార్హం.