వారు గనుక తలచుకుంటే ఆకాశమంత పందిరేసి ఘనంగా వివాహం చేయగలరు. కానీ పెళ్లి కూతురు మారం చేయడంతో ఎంతో నిరాడంబరంగా ఆసుపత్రిలోనే పెళ్లి చేయాల్సి వచ్చింది. అయితే ఇక ఆ పెళ్లి కూతురు కోరిక వెనుక ఎంతో బలమైన కారణమే ఉంది. అందుకే ఆ వరుడు కుటుంబసభ్యులు కూడా ఆమెకు అడ్డుచెప్పలేకపోయారు. ఇక వాళ్ళిద్దరికి ఆసుపత్రిలోనే పెళ్లి చేశారు. మరి పెళ్లి కూతురు హాస్పిటల్‌లోనే పెళ్లి చేసుకుంటానని మారం ఎందుకు చేసిందంటే...ఇక టెక్సాస్ నగరానికి చెందిన సీన్ అనే అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.ఇక వాళ్ల సాంప్రదాయం ప్రకారం.. చర్చి లేదా ఏదైనా ఫంక్షన్ హాల్ లో బంధువులు, అతిథులు మధ్య పెళ్లి చేసుకోవాలి. కానీ అక్కడ సీన్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. పెళ్ళైతే చేసుకుంటుందే గానీ.. ఆమె మాత్రం సంతోషంగానే లేదు.ఎందుకంటే ఆమె మనసంతా హాస్పిటల్‌పైనే ఉంది. దానికి కారణం ఆ వధువు అమ్మమ్మ రసెల్ అట.
ఇక 71 సంవత్సరాల రసెల్ క్యాన్సర్ వ్యాధితో మెథడిస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.దాంతో ఆమె మనవరాలు సీన్ ఎంతో బాధ పడింది.నిజానికి సీన్ వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ, ఆమె అమ్మమ్మ చాలా తీవ్రంగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె తన పెళ్లిని చూడలేదేమో అని బాధపడింది. ఇక దాంతో ఇంట్లోవారిని ఒప్పించి ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, పెళ్లి కొడుకు ఇందుకు అంగీకరిస్తాడా, లేదా అనే అనుమానం వచ్చింది.ఇక అతడు కూడా మంచి మనసుతో అక్కడ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు.సీన్ పెళ్లి గౌనులో ఆసుపత్రిలో ఉన్న తన అమ్మమ్మ రసెల్ ముందు నిలుచుంది. అంతే.. ఆమె అమ్మమ్మ కంట్లో అస్సలు నీళ్లు ఆగలేదు. ఆమె తన కోసం ఆసుపత్రికి రావడం చూసి తన అమ్మమ్మ ఉబ్బితబ్బిబయ్యింది. పెళ్లి కూడా ఆమె ముందే చేసుకుంటానని సీన్ చెప్పడంతో ఆమె ఆనందానికి ఇక అవధుల్లేవు.ఇక మొత్తానికి సీన్ అనుకున్నది సాధించడం జరిగింది. తన అమ్మమ్మ ముందే తన పెళ్లి చేసుకుంది. ఆ వధువరులిద్దరు రసెల్‌ను కౌగిలించుకొని భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లికి అనుమతి ఇచ్చినందుకు ఆసుపత్రి సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు.బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఆ పెళ్లి చూసిన కొద్ది గంటల్లోనే రసెల్ చనిపోయింది.