అందంగా లేవంటూ బాస్ నుంచి మెయిల్...

Purushottham Vinay
ఉద్యోగాల కోసం తిరిగేవారు రోజూ ఎన్నో కంపెనీల్లో ఉన్న చాలా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు. ఇక అప్లై చేసుకున్న ఉద్యోగాల్లో ఏదో ఒకటైనా ఉద్యోగం రాకపోతుందా? అని ఎదురు చూస్తుంటారు. కానీ ఆ కంపెనీలలో చాలా ఉద్యోగాల అప్లికేషన్లకు ఎలాంటి రిప్లై అనేది ఉండదు. ఇక ఇలాంటివి పెద్ద ఇబ్బందిగా అనిపించవు కానీ ఉద్యోగానికి నువ్వు సరిపోవని మాత్రం చెబుతూ మెయిల్ వస్తే మాత్రం చాలా బాధనిపిస్తుంది. ఇక అందులోనూ ఆ రిప్లైలో వాడిన భాష కాస్త ప్రొఫెషనల్‌గా లేకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి ఓ మరచిపోలేని సంఘటనను ఎదుర్కొంది ఓ అమ్మాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...ఇక అమెరికాలోని మిషిగన్‌కు చెందిన కాలేజీ గ్రాడ్యుయేట్ గ్రేసీ లొరిక్జ్ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది.

ఇక అక్కడే లోకల్ బొటీక్‌లో సేల్స్ మోడల్ పొజిషక్‌కి అప్లై చేసింది.అప్లై చేసుకున్న తరువాత తనని ఇంటర్వ్యూకి పిలుస్తూ మెయిల్ వస్తుందని ఆమె భావించడం జరిగింది. కానీ దానికి బదులుగా ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నుంచి ఓ యాక్సిడెంటల్ మెయిల్ ఆమెకు వచ్చింది.ఆ మెయిల్ లో ఆమె మరీ అంత అందంగా లేదని అతడు చెప్పడం గ్రేసీకి చాలా కోపాన్ని కలిగించింది.దాంతో ఆమె కోపాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.ఇక ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను అవా లేన్ అనే కంపెనీలో బ్రాండ్ రిప్రజెంటేటివ్ గా పని చేసేందుకు అప్లై చేశాను. ఇక ఆ కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం బ్యూటీ విత్ కాన్ఫిడెన్స్ (అంటే ఆత్మవిశ్వాసంతోనే అందం). కానీ అలాంటి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నుంచి నాకు అనుకోకుండా ఓ మెయిల్ వచ్చింది. నేను అందంగా లేను అని ఆ మెయిల్ లో వెల్లడించారు’ అని వివరించింది గ్రేసీ.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: