స్కూల్ క్యాంటీన్లో చిరుత.. ఎలా పట్టుకున్నారో చూడండి?

praveen
సాధారణంగా చిరుత పులి ని చూశారు అంటే ఎవరి వెన్నులో అయినా వణుకు పుడుతూ ఉంటుంది. ఏదైనా జూలాజికల్ పార్క్ లోకి వెళ్లి అక్కడ ఉన్న చిరుత పులిని చూసిన భయం వేస్తూ ఉంటుంది. ఇక అదే నేరుగా అడివిలో చూస్తే ఇక ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్. అయితే మొన్నటి వరకు అడవుల్లో ఉండే చిరుతపులులు ఇక ఇటీవల కాలంలో జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.  జనావాసాల్లోకి వచ్చి ఎన్నో పశువులు మనుషుల ప్రాణాలు సైతం తీస్తున్నాయి చిరుతపులులు. ముఖ్యంగా అడవులకు సమీపంలో ఉండే గ్రామాల్లోకి తరచూ వస్తూ ప్రజలందరికీ బెంబేలెత్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 అయితే ఇక్కడ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇటీవల ఏకంగా ఒక స్కూల్ క్యాంటీన్ లోకి చిరుతపులి వచ్చింది. చివరికి అక్కడి నుంచి ఎలా బయటకు వెళ్లాలో తెలియక అక్కడే చిక్కుకుపోయింది ఆ చిరుత పులి. కొన్ని రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకుండా అల్లాడిపోయింది. ఆ తర్వాత ఇక గట్టిగా అరవటం మొదలు పెట్టింది. అయితే ఇక స్కూల్ క్యాంటీన్ నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి అని గ్రహించిన స్థానికులు చిరుత పులి ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో   వెలుగులోకి వచ్చింది. థోకేశ్వర్ గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం లో చిరుత పులి ప్రత్యక్షమైంది.

 అయితే చిరుతపులి అప్పటికే పూర్తిగా గాయాలతో ఉండడంతో ఎంత ప్రయత్నించినా బయటపడలేక పోయింది. ఈ క్రమంలోనే ఇక చిరుతపులి శబ్దాలు విని స్థానికులు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఇక నాలుగు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి చిరుతను సురక్షితంగా క్యాంటీన్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత చిరుతకు ప్రాథమిక చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: