మనం ప్రతిరోజు అనేక మైనటువంటి వస్తువులను చూస్తుంటాం. మరికొన్నింటిని ఎందుకు ఉపయోగిస్తారు తెలుసు, కానీ మరికొన్నిటిని ఎందుకు ఎలా వాడుతారు తెలియదు. కాబట్టి ఇప్పుడు మన చుట్టూ జరిగే ఇటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
1).దోమలు:
దోమలు రాత్రి సమయాలలో ఎక్కువగా కొంతమంది తల మీద ఉంటాయి. ఎందుకంటే మానవుల నుంచి వెలువడే చెమట, వేడి ఎక్కువగా ఉంటే , అవి వారి దగ్గరికి వస్తాయి. అంతేకాకుండా తల మీదే ఎక్కువగా వేడి బయటికి విడుదల అవుతుంది. కావున అవి తల మీద ఎక్కువగా ఉంటాయి.
2). ఫ్యాన్ కు మూడు రెక్కలు ఎందుకు ఉంటాయి..?
మనదేశంలో ఫ్యాన్ లకు ఎక్కువగా మూడు రెక్కలే ఉంటాయి. కానీ ఇతర దేశాలలో నాలుగు, ఐదు రెక్కల ఫ్యాన్ లు ఉన్నాయి. కారణం ఏమిటంటే.. ఎక్కువ రెక్కలు ఉన్న ఫ్యాన్లు గాలిని ఎక్కువ ఇవ్వలేవు. కనుక అమెరికా వంటి దేశాలలో ఎక్కువగా AC వాడుతారు. అది రూమ్ అంతా విస్తరింపచేయడానికి 5 రెక్కల ఫ్యాన్ ఉపయోగిస్తారు. తక్కువ స్పీడులో తిరిగే విధంగా ఐదు రెక్కల ఫ్యాన్లను ఎంచుకుంటారు.
3). విమానాలలో మొబైల్స్ ని స్విచ్ ఆఫ్ ఎందుకు చేయమంటారు?.
విమానాలలో ప్రయాణించేవారి మొబైల్ ఆన్ లో ఉండడం వల్ల అవి నెట్వర్క్ కోసం ఎక్కువగా వెతుకుతాయి. అందువల్ల అందులో నుంచి విడుదలయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ వల్ల ఒక రకమైన రేడియో పొల్యూషన్ విడుదలవుతుంది. ఇది ఫైలెట్ కు చికాకు తెప్పిస్తుంది. అందుచేత విమానాల్లో మొబైల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేస్తారు.
4). రైల్వే పట్టాలపై కంకర ఎందుకు వేస్తారు ..?
సాధారణంగా రైల్వే పట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పట్టాల చుట్టూ కంకర రాళ్ళు వేసి ఉంటారు. వీటివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటంటే ఈ కంకర రాళ్లు కాకుండా నేల మీద ట్రాక్ వేసినట్లయితే అది భూమిలోకి కృంగిపోతుంది. అందుచేతనే కంకర రాళ్ల మీద వేస్తారు. అంతేకాకుండా రైల్వే పట్టాల పక్కన పెద్ద భవనాలు ఉన్నప్పుడు, రైలు శబ్దాల వల్ల ఆ భవనాలు కూలిపోకుండా , ఆ శబ్దాలను ఈ రాళ్ళు గ్రహిస్తాయి.
5). క్యాలెండర్:
కొన్ని శతాబ్దాల క్రితం"న్యూమా"అనే ఒక రోమన్ రాజు. చంద్రుడు ఆకారంలో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకొని 12 నెలలు కలిగిన ఒక క్యాలెండర్ ని తయారు చేశారు. ఆ క్యాలెండర్ లో జనవరి, ఫిబ్రవరి నెలలు చివర్లో ఉండేటివి. అంటే మార్చి నుండి సంవత్సరం మొదలయ్యేది. అలాగే ఒక సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉండేవి. అయితే అప్పట్లో రోమన్లకు సరి సంఖ్యలు అంటే భయమట. అంతేకాకుండా దురదృష్టకరంగా భావించేవారు.దాంతో ఆ రాజు 354 రోజులను కాస్త ఒకరోజు యాడ్ చేసి మొత్తం 355 రోజులు చేశారు. కానీ కొంత కాలం తరువాత,జూలియస్ సీజర్ అనే మరొక రోమన్ రాజు ఈజిప్షియన్లు ఫాలో అవుతున్న, సోలార్ క్యాలెండర్ గురించి తెలుసుకోవడం తో సూర్యుని ఆధారంగా చేసుకున్న ఈజిప్టు క్యాలెండర్లలో ఒక సంవత్సరానికి 365.24 రోజులు పడుతుంది. ఇది ఆ రాజుకు నచ్చడంతో, ఇది చంద్రుని ఆధారంగా చేసుకొని.. రోమన్ క్యాలెండర్ లో మార్పులు చేశాడు. పాత క్యాలెండర్ లో 355 రోజులు ఉండేవి. కానీ ఉండవలసినవి 365 రోజులు మిగిలిన ఆ 10 రోజులను ఒక్కో నెలకు కలిపాడు. ఫిబ్రవరి నెల కు తప్ప. అయినా ఇంకా 0.24 రోజులు మిగిలాయి. దాంతో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలకు ఒక రోజున యాడ్ చేశారు. 29 రోజులు అయ్యాయి. దీనిని మనం లీప్ సంవత్సరం అంటాము.