ఒక్క గంటలో 2 కిలోల బరువు తగ్గిన మహిళ.. అదెలా సాధ్యమైందంటే..?
అయితే ఈమె 2018 లో జరిగిన సిలేసియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ లో "అటామ్‌వెయిట్ ఫ్లై వెయిట్" (48KG) కేటగిరిలో ఆడేందుకు సిద్ధమయ్యారు. బాక్సింగ్ మ్యాచ్ 4 గంటలు ఉందనగా.. ఆమె వెయిట్ చెక్ చేసుకుంటే 48 కిలోల కంటే ఎక్కువగా బరువు ఉన్నట్లు తేలింది. అయితే పోటీలో పాల్గొనకుండా వెనక్కి తిరిగి రావటం మేరీకోమ్ కి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఆమె ఏకంగా ఒక గంట పాటు స్కిప్పింగ్ చేసి 2 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచారు. సాధారణంగా 10 నిమిషాలు ఆగకుండా స్కిప్పింగ్ చేయాలంటేనే ఎంతో స్టామినా ఉండాలి. కానీ మేరీకోమ్ గంటపాటు ఆగకుండా స్కిప్పింగ్ చేసి తన పట్టుదల, శక్తి ఏంటో నిరూపించారు. గంట పాటు స్కిప్పింగ్ చేసిన తర్వాత శరీరంలో శక్తి తగ్గిపోతుంది కానీ మేరీకోమ్ మాత్రం బాక్సింగ్ రింగ్ లోకి దిగి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించి పసిడి పతకం గెలిచి కోట్ల మంది భారతీయులను ఫిదా చేశారు.
అయితే కేవలం ఒక గంట వ్యవధిలో 2 కిలోల బరువు ఎలా తగ్గారంటే.. సాధారణంగా రన్నింగ్, స్కిప్పింగ్ చేస్తుంటే ఒంట్లోని నీటి శాతం బాగా తగ్గుతుంది. దీనివల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. 45 నిమిషాల కంటే ఎక్కువగా స్కిప్పింగ్ చేస్తే బాడీ లోని నీటి శాతం బాగా తగ్గిపోయి కొవ్వు కూడా తగ్గటం ప్రారంభమవుతుంది. అయితే ఇలా చేయడం కేవలం ప్రొఫెషనల్ ఫైటర్స్ కి మాత్రమే సాధ్యమవుతుంది. సాధారణ వ్యక్తులు తమ శరీరాన్ని బాగా కష్టపడితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కానీ మేరీ కోమ్ తన బాడీని సంవత్సరాల తరబడి కఠినమైన కసరత్తులతో బాగా ట్రయిన్ చేశారు కాబట్టి ఆమె 45 నిమిషాలకు పైగా స్కిప్పింగ్ చేసి బరువు తగ్గారు.
మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్టులు ఎక్కువగా ఇదే పద్ధతిని ఫాలో అవుతుంటారు. ఒక ఫైటర్ 19 గంటల్లో 7 కిలోల 200 గ్రాములు తగ్గాడు. అయితే ఈ వెయిట్ లాస్ జర్నీ మొత్తంలో డాక్టర్లు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల పర్యవేక్షణలో కాకుండా తమ సొంతంగా బరువు తగ్గడానికి ట్రై చేసిన కొందరు మృత్యువాతపడ్డారు. ఈ ప్రక్రియలో కిడ్నీ, గుండె లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. కండరాల్లో గ్లయికొజెన్ తగ్గిపోవటం వల్ల తీవ్రమైన అలసట దాపురించే ప్రమాదం కూడా ఉంది.