చూపులేని ఏనుగుకి మరో ఏనుగు సహాయం...

Purushottham Vinay
ఒకళ్ళకి ఒకళ్ళు సాయం చేసుకోవడం అనేది మనిషి నైజం. అది మనిషి యొక్క చక్కటి గుణం. కాని ఈరోజుల్లో మనుషుల్లో అది తక్కువగా కనిపిస్తుంది. ఈ కాలంలో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యి కళ్లెదురుగా సాటి మనిషి చనిపోతున్న కూడా పట్టించుకోలేని పరిస్థితిల్లో వున్నారు.స్వార్ధంతో బ్రతుకుతున్న రోజులు ఇవి. అలాంటి ఈ రోజుల్లో జంతువులు తమ తోటి ప్రాణులకు సాయం చేస్తూ తమ సేవాగుణాన్ని బయటపెట్టి మనుషులకే ఆదర్శంగా నిలుస్తున్నాయి.ఈ భూమ్మీద బ్రతుకుతున్న బలమైన ప్రాణులు అంటే ముందుగా మనకు ఏనుగులే గుర్తుకువస్తాయి. ఇక ఏనుగులు కూడా మనుషుల లాగానే తమ కుటుంబ జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యమిస్తాయి. అన్నీ ఏనుగులు కూడా ఎంతో కలిసికట్టుగా గుంపుగా జీవిస్తుంటాయి. ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి. వాటి కష్టాల్లోనూ అవి ఎప్పుడు కూడా తోడు నీడగా ఉంటాయి.
ఇక ఏనుగుల స్నేహానికి ఎంత విలువ ఇస్తాయో తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను తప్పకుండా చూసి తీరాల్సిందే..లెక్ చాయిలెర్ట్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో ఏనుగుల వీడియోను పోస్టు చేయడం జరిగింది.ఇక ఆ వీడియోలో ఉన్న మూడు ఏనుగుల్లో ఒక ఏనుగుకు కంటి చూపులేదు. దీంతో ఆ ఏనుగు ఆహారాన్ని వెతుక్కోవడానికి చాలా ఇబ్బందిపడుతోంది. దాని కష్టాన్ని అర్థం చేసుకున్న మరో ఏనుగు ఆ కంటి చూపు లేని మరో ఏనుగుకి సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇక ఆ ఏనుగును తనకు కావాల్సిన ఆహారం వరకు తీసుకెళ్లింది. దీన్ని బట్టి ఏనుగులకు కూడా సాయం చేసే గుణం ఉంటుందని తేలింది. ఇక కొందరు ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు అయితే ఈ వీడియోని దాదాపు 12 వేల మందికి పైగా వీక్షించారు. ఇక ఆ ఏనుగులకు ఫిదా అయిన నెటిజన్స్ ఆ ఏనుగులను చూసైనా మనుషులను మానవత్వంతో మెలగాలని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోని చూస్తే మీరు కూడా ఆ ఏనుగు చేసిన సహాయానికి ఖచ్చితంగా ఫిదా అవుతారు.
Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: