వీటిని ఎప్పుడైనా గమనించారా..?
1).cookies:
కంప్యూటర్ భాషలో కుకీస్ అనగా ఇన్ఫర్మేషన్ ను మెయింటైన్ చేస్తాయి. ఇక ప్రతి ఒక్కటి మన కంప్యూటర్లో సేవ్ చేయాలన్నా cookies అవసరం చాలానే ఉంటుంది.
2).android:
మన మొబైల్ లో ఉపయోగించే ఆండ్రాయిడ్ సిస్టమ్ కి ఆండ్రాయిడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే. ఆండ్రాయిడ్ పిక్చర్ చూసినట్లయితే అది రోబో లా కనిపిస్తుంది. దీనిని కనిపెట్టింది 2003లో ఆండ్రాయిడ్ రూబిన్ అనే వ్యక్తి కనిపెట్టాడు.అందుకే ఆ పేరు వచ్చింది.
3). mobile NCS (నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్):
మన దగ్గర ఉండే మొబైల్స్ కి కెమెరా పక్కన గాని, ఫ్లాష్ లైట్ పక్కన గాని చిన్న రంధ్రం లాంటిది ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే మన చుట్టూ ఉండే శబ్దాలను అరికట్టి , కేవలం మనం చెప్పే శబ్దాలను మాత్రమే మొబైల్ కు అందిస్తుంది. అందుకే ఈ చిన్న రంధ్రాన్ని " నాయిస్ క్యాన్సిలేషన్ హోల్"అని అంటారు.
4). కోడి ముందా గుడ్డు ముందా:
ఈ ప్రశ్న చిన్నప్పటినుంచి మనందరికీ తెలిసినదే. కానీ ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే.. గుడ్డులో ఉండే ప్రోటీన్స్ ను కేవలం కోడి మాత్రమే ఉత్పత్తి చేయగలదు. అందుచేతనే కోడి ముందు అని తెలియజేశారు.
5). ప్లేయింగ్ కార్డ్స్:
మనం మొబైల్స్ లో రమ్మీ గేమ్ లో చూసే ఉంటారు, లేదా ఎక్కడైనా ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నప్పుడు ఈ విషయాన్ని మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. అదేమిటంటే. ఇందులో 4 kings ఉంటాయని అందరికీ తెలుసు. కొందరికి తెలియని విషయం ఏమిటంటే. ఇందులో ఉండే పిక్చర్ లలో 3 కింగ్స్ కి మాత్రమే మీసాలు ఉంటాయి. మిగతా ఒకదానికి మీసాలు ఉండవు. అలా ఎందుకు ఉండవు అంటే. బ్రిటిష్ న్యూస్ పేపర్ అయినా "the granden "ప్రకారం ఆ ఒక్క కింగ్ కి కూడా మీసాలు ఉండేవి. ఎప్పుడైతే ఆ కార్డ్స్ అన్ని రీమోడలింగ్ చేశారో అప్పుడు ఆ కార్డు కి మీసం పెట్టడం మర్చిపోయారు.