క్యాడ్బరీను బ్యాన్ చేయాలంటూ వార్తలు దుమారం..!
అలాంటి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్, ప్రస్తుతం బ్యాన్ చేయాలనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ క్యాడ్బరీ చాక్లెట్ కు సంబంధించిన ఒక పోస్టరు సోషల్ మీడియాలో తెగ దుమారం రేపుతోంది. ఈ క్యాడ్బరీ చాక్లెట్ ను తయారు చేసేటప్పుడు గొడ్డు మాంసాన్ని కలుపుతున్నారని, భారత దేశంలో హిందువులు చాలామంది ఉన్నారని హిందువులు ఇలాంటి మాంసాన్ని తినడానికి అసలు ఒప్పుకోరని ఇక ఇలాంటి చాక్లెట్లను ఎలా మీరు అమ్ముతున్నారని , వెంటనే నిలిపివేయాలని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే దీనికి స్పందించిన క్యాడ్బరీ కంపెనీ.. తమ ఉత్పత్తులలో ఇలాంటి గొడ్డు మాంసాన్ని , జెలిటిన్ రూపంలో కలవడం లేదు అని, అది ఆస్ట్రేలియాకు సంబంధించిందని, భారత దేశములో పూర్తిగా శాకాహారంతో మాత్రమే, తయారుచేసిన క్యాడ్బరీ చాక్లెట్ లను అమ్మకానికి పెడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అంతే కాదు ఎవరో తమ సంస్థ ఎదగడం ఇష్టం లేక ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని కూడా ఆ సంస్థ వాపోయింది.
ఇక ఇలాంటి నెగిటివ్ పోస్టులు రావడం వల్ల క్యాడ్బరీ ఇమేజ్ దెబ్బతింటుందని, అంతేకాదు తమ కస్టమర్ల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తున్నాయని, క్యాడ్బరీ ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు వాటిని 100% శాకాహారంతో నే, తయారు చేసి మరీ ధృవీకరించబడింది.. అని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇలాంటి వార్తలను మరొకసారి చేయవద్దు అంటూ కూడా హెచ్చరిస్తోంది క్యాడ్బరీ సంస్థ.