వైరల్ వీడియో : వరుడితో వింత ఒప్పందం.. ఆ తర్వాతే ఎంట్రీ?
ఇక పెళ్లి అంటే ఇలాంటివన్నీ కామన్ కాబట్టి అటు వరుడు కూడా వధువు తోబుట్టువులు చేసే చిలిపి చేష్టలను ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిన తర్వాత ఇక వధువు వరుడు పెళ్లి కూతురు ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఇలాగే వెళ్లారు నూతన వధూవరులు. కానీ అక్కడ పెళ్ళికొడుకుని ఇంట్లోకి రానివ్వలేదు వధువు తోబుట్టువులు. ఏకంగా ఒక అగ్రిమెంట్ పై సంతకం చేసేంత వరకు కూడా ఇంట్లోకి రానివ్వం అంటూ తెగేసి చెప్పేశారు. ఇక చేసేదేమీ లేక చిరునవ్వుతో సంతకం పెట్టేసాడు వరుడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.
ఈ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. వరుడు ఆయుష్ వధువు రాధిక తో కలిసి అత్త వారి ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే వధువు తోబుట్టువులు వరుడు ఆయుష్ నీ బయట నిలబెట్టారు. ఇంట్లోకి రావాలంటే కొన్ని కండిషన్స్ కి అంగీకరించాలి అంటూ తెలిపారు. ఈ క్రమంలోనే 3 షరతులతో కూడిన ఒక పత్రాన్ని అతని ముందు ఉంచారు. ఇందులో రాధిక ఎప్పుడూ సరైనది ఆమెను యేడాదికి రెండు లేదా మూడు సార్లు విదేశాలకు తీసుకెళ్లాలి... అంతే కాదు రాధిక ఎప్పుడు ఏం అడిగినా కూడా కొనివ్వాలి.. షరతులు అన్నింటికీ అంగీకరించి ఇక్కడ సంతకం చేయగలరు లేకపోతే లోనికి ప్రవేశం లేదు అంటూ ఒక ఫ్లెక్సీ తన ముందు ఉంచగా నవ్వుతూ దానిపై సంతకం చేశాడు వరుడు