సంవత్సరానికి 5 గంటలు మాత్రమే తెరిచి ఉండే గుడి ఎక్కడో తెలుసా..?
మన భారతదేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు సంవత్సరం పొడవునా, భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తే, మరి కొన్ని దేవాలయాలు అనగా చార్ ధామ్ , శబరిమలై వంటి పుణ్యక్షేత్రాలు.. కేవలం సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. కానీ ఇక్కడ ఒక దేవాలయంలో మాత్రం సంవత్సరానికి ఐదు గంటలు మాత్రమే భక్తులకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తారట.. ఏంటి వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా..! నిజమే మీతో పాటు.. నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. కానీ అది ఎక్కడో తెలిస్తే ఔవునా..! అని అంటారు.. అయితే ఆ దేవాలయం ఎక్కడ ఉంది.. దాని విశిష్టత ఏంటి.. అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో, ఒక కొండపై ఉన్న నీరయ్ మాతా దేవాలయం గురించి, మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ దేవాలయమును ముఖ్యంగా సంవత్సరంలో వచ్చే చైత్ర నవరాత్రి పర్వదినాన తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుంచి ఉదయం తొమ్మిది గంటల సమయం వరకు మాత్రమే అంటే కేవలం ఐదు గంటలు మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. అందుకే ఆ రోజున ప్రత్యేకంగా కొన్ని వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ కుంకుమ, పసుపు గాని ఇలాంటివి ఎటువంటివి ఉపయోగించరు.కేవలం కొబ్బరికాయ కొట్టి, అగరవత్తులు వెలిగిస్తే సరిపోతుంది.
ఇక అంతే కాదు, ఈ గుడిలోకి ఆడవారి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇక అక్కడ పంచిన ప్రసాదం కూడా మహిళలు తింటే , పాపం అడ్డుకుంటుందని ఆచారం కూడా ఉందట. ఇక అంతే కాదు ఇక్కడ దీపం చైత్ర నవరాత్రి సమయంలో ఎవరూ వెలిగించకపోయినా.. దానంతటదే వెలుగుతుంది అని, అక్కడ భక్తులు చెబుతున్నారు. కానీ ఇందుకు గల రహస్యం ఏమిటి.. అని ఎవరు ఇప్పటివరకు చేధించలేకపోయారు.