పిల్లిని వెతికిపెడితే బహుమతిస్తారట.. ఎక్కడో తెలుసా?

Suma Kallamadi
సాధారణంగా ఓ వ్యక్తి తప్పిపోతే, సదరు తప్పిపోయిన వ్యక్తి సమాచారమిచ్చినా, అతడు ఎక్కడున్నా కనిపెట్టి వివరాలు తెలిపినా బహుమతి కింద నగదు ఇవ్వడం మనం చూడొచ్చు. ఈ మేరకు ప్రకటనలిస్తుంటారు తప్పిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించి ప్రత్యేక ప్రకటనలు ఇస్తుంటారు. అయితే, ఇక్కడ ఓ వింత ప్రకటన చేశారు ఒకరు. తమ పిల్లిని వెతికిపెడితే డబ్బులిస్తామని పేర్కొంటున్నారు? ఈ విషయమై ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమేమొచ్చింది వారికి? ఇంతకీ క్యాట్ ఎక్కడ తప్పిపోయింది? అసలేం జరిగింది? తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా చదవాల్సిందే.

తెలంగాణలోని సికింద్రాబాద్‌లో నివాసముంటున్న సెరునా నెట్టో కొంత కాలంగా ఓ పిల్లిని పెంచుకుంటోంది. దానికి జింజర్ అనే పేరు పెట్టుకుంది. ఈ మధ్యకాలంలో జింజర్‌ ఆరోగ్యం బాగాలేకపోవడంతో దానిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. టోలిచౌకిలోని ట్రస్టీ వెట్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఆస్పత్రిలో అడ్మిట్ అయిన తర్వాత క్యాట్ అదృశ్యమైంది. ఎంత వెతికినా అస్సలు వారికి కనిపించలేదు. నాలుగు రోజుల పాటు వారి ఆస్పత్రి చుట్టూ తిరిగారు. ఈ విషయమై ఆస్పత్రి సిబ్బందిని నిలదీసినా వారు ఎలాంటి సమధానం చెప్పలేదు.

 ఆస్పత్రిలో క్యాట్ అడ్మిట్ చేశాం కాబట్టి దాని బాధ్యత వారిదేనని పిల్లిని పించుకుంటున్న సెరునా వాదించింది. కానీ, ఆస్పత్రి యాజమాన్యం పొంతన లేదని సమాధానాలతో ఈ విషయంలో తప్పించుకున్నారు. పిల్లికి సర్జరీ కోసం జూన్ 17న ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్ది క్షణాల్లోనే అది అదృశ్యమైందని ఈ సందర్భంగా సెరునా మీడియాకు తెలిపింది. అలా ఎలా క్యాట్ మాయమైతుంది? ఆస్పత్రి వారు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? అసలు నిజం చెప్పండని సెరునా ఆస్పత్రి వారిని నిలదీసింది. ఈ క్రమంలో పిల్లి ఎక్కడికో పారిపోయిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మొత్తంగా పిల్లి అదృశ్యంపై ఆవేదన చెందారు.ఈ నేపథ్యంలో తన పిల్లిని తెచ్చి ఇచ్చిన వారికి రూ.30 వేలు నగదు బహుమతి ఇస్తానని సెరునా మీడియాకు తెలిపింది. తన పెంపుడు పిల్లిని పట్టించుకోనందున సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: