వైరల్ : కోక్ బాటిల్లో ఇరుక్కున్న పాము.. యువకుడు ఏం చేసాడో తెలుసా?
ఇక్కడ ఇలాంటిదేవెలుగులోకి వచ్చింది.. కాస్త అటూ ఇటూ అయినా అతని ప్రాణం పోతుంది అని అతనికి తెలుసు... కానీ ఒక విషపూరితమైన పాము ప్రమాదంలో చిక్కుకొని అల్లాడుతుంటే మాత్రం ఒక మానవత్వం ఉన్న మనిషి గా చూసి సైలెంట్ గా ఉండలేకపోయాడు. దీంతో ఆ విషపూరితమైన పాము కు విముక్తి కల్పించాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో సేపటి వరకు తన సమయాన్ని పాములు రక్షించేందుకు కేటాయించాడు. చివరికి ఆ పాము ప్రాణాపాయం నుంచి రక్షించాడు ఆ యువకుడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక విషపూరితమైన రాటిల్ స్నేక్ ఒక కోక్ బాటిల్ లో ఇరుక్కు పోయింది. కోక్ బాటిల్ పెద్దగా ఉంది అని భావించి ఆ బాటిల్ లోకి దూరేందుకు ప్రయత్నించింది. కానీ ఇక సగం దూరేసరికి ఆ పాము బాటిల్లో పట్టలేదు. దీంతో అలాగే ఇరుక్కుపోయింది. దీంతో ఇక ప్రాణాపాయ స్థితిలో విలవిల లాడింది ఆ పాము. అటువైపుగా వెళుతున్న ఓ వ్యక్తి దానిని గమనించాడు. అయితే అది విషపూరితమైన పాము అని అది కాటు వేస్తే ప్రాణం పోతుంది అన్న విషయం ఆ వ్యక్తికి తెలుసు.. అయినప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయలేదు ఎంతో కష్టపడి ఎలాంటి గాయం కాకుండా ఆ కోక్ బాటిల్ ని కోసి ఇక ఆ పాము ని బయటకు తీసాడు. తర్వాత సురక్షితంగా ఆ పామును కాపాడాడు. ఇలా ఏకంగా ఒక విషపూరితమైన పాము విషయంలో కూడా మానవత్వం చాటిన అతని పై ప్రశంసల వర్షం కురుస్తోంది.