వైరల్ వీడియో : అంతరిక్షంలో ఒలంపిక్స్.. ఎలా ఆడారో చూడండి?

praveen
విశ్వ క్రీడ లైన టోక్యో ఒలింపిక్స్ ఇటీవలే ముగిసాయి. కరోనా వైరస్ వల్ల ఎన్నో సవాళ్లు ఎదురైనప్పుడు కి అన్నింటినీ అధిగమించుకుంటూ వచ్చిన జపాన్ ప్రభుత్వం విజయవంతంగా టోక్యో ఒలంపిక్స్ నిర్వహించింది. అయితే గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ వాయిదా పడుతూ వచ్చి ఇక ఈ ఏడాది ఎలాంటి హడావుడి లేకుండా సాదాసీదాగానే జరిగి పోయింది అనే చెప్పాలి. ఇక ఈ ఒలంపిక్స్ లో వివిధ దేశాల నుంచి సత్తాచాటిన క్రీడాకారులు ఎన్నో పథకాలను అందుకున్నారు. ఇక ఒలంపిక్స్ జరిగినన్ని రోజులు  ఈ మెగా టోర్నీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు మరో ఒలంపిక్స్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.



 ఇప్పటివరకు భూమిమీద నిర్వహించిన ఒలంపిక్స్ మీరు చూసే ఉంటారు. ఒలంపిక్స్ లో ఎంతో మంది క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. కానీ అంతరిక్షంలో ఒలంపిక్స్ జరగడం ఎప్పుడైనా చూశారా.? అంతరిక్షంలో ఒలంపిక్స్ ఏంటండి అది సాధ్యమవుతుందా అని ఆశ్చర్యపోతారు ఇలా అడిగితే ఎవరైనా. కానీ ఇటీవలే అంతరిక్షం లో జరిగిన ఒలంపిక్స్ కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది. ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ఇటీవలే  వ్యోమగాములు అంతరిక్షంలో ఒలంపిక్స్ గేమ్స్ ఆడారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో పలు పోటీలను సరదాగా నిర్వహించారు వ్యోమగాములు.


 ఇక అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ లో వ్యోమగాములు ఆడిన ఆటలు చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు జిమ్నాస్టిక్ స్విమ్మింగ్ హ్యాండ్ బాల్ లాంటి ఆటలు ఆడేందుకు ఎంతగానో ప్రయత్నించారు వ్యోమగాములు. ఇలా ఆటలు ఆడేందుకు స్పేస్ స్టేషన్ లో వ్యోమగాములు పడుతున్న కష్టాలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్ థామస్ ఇక ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: