వైరల్ వీడియో: ఈ కొండచిలువను చూస్తే షాక్ అవ్వాల్సిందే...!

Suma Kallamadi
సోషల్ మీడియా అనేది ఒక అద్భుత ప్రపంచం. అందులో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. చాలా మంది ఆ వీడియోను చూసి ఆశ్చర్య పోతుంటారు. ఇంకొందరు అయితే భయపడిపోతుంటారు. ఇందులో పాపులర్ అవ్వాలనుకునేవారు రక రకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వదులుతుంటారు. వాటి వల్ల చాలా మంది పాపులర్ అవ్వడమే కాదు. సెలబ్రిటీలు కూడా అయ్యారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కొన్ని రకాలైన వీడియోలు చాలా అందంగా మనసుకు ప్రశాంతంగా ఉంచేవిగా ఉంటాయి. ఇంకొన్నింటిని చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు నవ్వును పూయిస్తుంటాయి. ఇంకొన్ని అందర్నీ భయపెట్టేవిగా ఉంటాయి. ఈ వీడియో కూడా మనల్ని ఒకింత భయపెడుతుంది. వింతలు, విశేషాలకు సోషల్ మీడియా నిలయం అని మనకు తెలుసు.
ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు, వాటి వేటకు సంబంధించిన వీడియోలు అయితే తెగ హల్చల్ చేస్తుంటాయి. నెటిజన్లను కూడా విపరీతంగా ఆకట్టుకుంటాయి.

తాజాగా అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు వైరల్ అవుతోంది. జయ్ బ్రేవర్ అనే స్నేక్ క్యాచర్ ‘Jayprehistoricpets’ అనే సరీసృపాల జూను నడుపుతున్నాడు. ఇందులో వివిధ జాతులకు చెందిన కొండ చిలువకు ఉన్నాయి. అతడు ప్రతీదాని గురించి వివరిస్తూ దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేస్తుంటాడు. ఇక ఆ వీడియోకు వేలల్లో లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చిపడతాయి. నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో పోస్ట్ చేశాడు. సుమారు 113 కేజీల బరువు, 25 అడుగుల ఎత్తు ఉన్న కొండచిలువను తన భుజాలపై పెట్టుకుని తీసుకెళుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిని చూసి నెటిజన్లు కామెంట్స్, లైకుల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: