అర్ధరాత్రులు టాయిలెట్ లో వింత శబ్దాలు.. డోర్ ఓపెన్ చేస్తే షాకింగ్..

Purushottham Vinay
మాములుగా కొన్ని శబ్దాలు చాలా వింతగా భయంకరంగా ఉంటాయి.ఇక అర్ధరాత్రి పూట గాఢమైన నిద్రలో ఉండగా మెలకువ వచ్చినప్పుడు.. చిన్న శబ్దాలు కూడా చాలా భయం పుట్టిస్తాయి. ఇలా అర్ధరాత్రి పూట నిద్రలేచిన ఒక వ్యక్తికి, ఎవరో బాత్రూంలో అదేపనిగా వాటర్ ఫ్లషింగ్ చేస్తున్నట్లు సౌండ్ వినిపించడం జరిగిందట. ఏంటా అని బాత్రూం తలుపు తీసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తికి ఆ బాత్రూంలో ఏమి కన్పించందో తెలుసా..? సుమారు ఆరు అడుగుల పొడవైన ఒక పెద్ద సర్పం మరుగుదొడ్డిలో బాగా బుసలు కొడుతూ కనిపించింది. ఇక ఈ ఘటన తనకు ఒక హర్రర్ సినిమాను తలపించిందని అతను చెబుతున్నాడు. ఇక ఆస్ట్రియా రాజధాని వియన్నా సమీపంలోని బ్రీటెన్‌ఫర్ట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఈ ఊహించని వింత ఘటన అనేది ఎదురైంది. అతను తేరుకున్న తరువాత బాత్రూంకు లాక్ వేసి అర్ధరాత్రి ఒంటి గంటకు అత్యవసర విభాగానికి అతడు ఫోన్ చేయడం జరిగింది.

ఇక దీంతో అగ్నిమాపక సిబ్బంది అతడి ఇంటికి చేరుకొని, ఎస్కులాపియన్ అనే జాతి పామును పట్టుకున్నారు.ఇక ఆ తరువాత దాన్ని అక్కడ సమీపంలోని అడవిలోకి వదిలడం జరిగింది.ఇక యూరప్‌లో కనిపించే ఈ ఎస్కులాపియన్ పామును బాధితుడి ఇంటి నుంచి సంరక్షించామని తెలిపడం జరిగింది. ఇక మోడ్లింగ్ డిస్ట్రిక్ట్ ఫైర్ బ్రిడ్గేడ్ ప్రతినిధి లుకాస్ డెర్కిట్స్. విషపూరితం కాని ఈ సర్పాలు రెండు మీటర్ల వరకు పొడవు పెరుగుతాయని చెప్పడం జరిగింది. యూరప్ ఖండంలోని అతిపెద్ద సరీసృపాలలో ఈ జాతి పాములు సైతం భాగమని వివరించడం జరిగింది. గోడల మధ్యలో ఉండే సందుల నుంచి పాము ఫ్లషింగ్ ట్యాంకులోకి వచ్చి ఉంటుందని లుకాస్ వెల్లడించడం జరిగింది.కాబట్టి నైట్ టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: