జాతీయ జెండాను ఎగరవేయడంతో కాల్పులు జరిపిన తాలిబన్లు..?

Divya
ఆఫ్ఘనిస్తాన్ లో ఈ తాలిబన్ల ఆకృత్యాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కొన్ని అనుకోని కారణాలవల్ల ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి అమెరికా సైనిక బలగాలు వెనుతిరిగి పోవడంతో తాలిబాన్ లకు అవకాశం చిక్కినట్లు అయింది. ఆఫ్ఘనిస్తాన్ జుట్టు తాలిబన్ల చేతికి చిక్కినట్లు అవడంతో ఆఫ్ఘనిస్తాన్ సైనిక దళాలపై తాలిబన్ యోధుల దాడి చేశారు. ఇక గత కొద్ది నెలలుగా నిర్విరామంగా ఆఫ్ఘనిస్తాన్ పై తాలిబన్ యోధులు దాడి చేస్తున్నారు. ఇప్పటికే ముంబైకి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఈ దాడులను రిపోర్టింగ్ చేయడం కోసం వెళ్లి అక్కడ ఆయన ప్రాణాలను కూడా అర్పించాడు.

ఇతనే కాదు ఇక ఎంతోమంది సమరయోధుల కూడా ఈ తాలిబన్ల దాడికి గురి అయ్యారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నిన్న కూడా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయిన కాబూలీ లో వినోద ఉద్యానవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో, ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరికొత్తగా జలాలాబాద్ లో ఆఫ్ఘనిస్తాన్ యోధులు , తమ జాతీయ జెండాను స్వేచ్ఛగా ఎగర వేస్తుండగా ఒక్కసారిగా వారిపై దాడులు జరిపారు.

ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది.ఇక  జలాలాబాద్‌లో నిరసనకారుల బృందం.. తాలిబాన్ జెండాను తిరస్కరించారు. అంతేకాదు ఆఫ్ఘన్ జాతీయ జెండాను  తిరిగి తమ కార్యాలయాల్లో  ఉంచాలని నిరసనకారుల బృందం డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా తాలిబన్ యోధులు మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ వాసులకు ఎలాంటి స్వేచ్ఛను కల్పించము, ఇక ఇస్లామిక్ మతం ప్రకారం మహిళలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకుంటామని తెలపడం జరిగింది.

జలాలాబాద్ లో ఒక వీధిలో రద్దీగా ఉన్న ప్రదేశంలో ఆఫ్గనిస్తాన్ నిరసనకారులు బృందం జాతీయ జెండాను ఎగుర వేయడంతో , తాలిబాన్ యోధులు కాల్పులు జరిపారు.. అయితే వారు నిరసనకారులను కాల్చి వేశారా..? లేక జాతీయ జెండాను కాల్చేశారా..? లేక గాల్లోకి కాల్పులు జరిపారా..? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు .అయితే ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ హెచ్ పీ సీ  డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ రిలేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ దాడికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ ఈ విషయాలను వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: