వైరల్ : సూది దారంతో గూడుకట్టుకున్న పక్షి?
సాధారణంగా మనం పక్షులు గూళ్ళు కట్టుకోవడం చూస్తూ ఉంటామ్. ఒకప్పుడైతే ఇంటి బయట ఉన్న చెట్లపై పక్షుల గూళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇక మొత్తం చెట్లను కొట్టివేయడంతో ఎక్కడో సుదూరంలో ఉన్న అడవుల్లో పక్షులు ఇక తమ గూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయితే పక్షుల గూళ్ళను ఇలా ఏర్పాటు చేసుకుంటాయో అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక పక్షి మాత్రం తన గూడు నీ ఎంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది ఏకంగా సూది దారం తో కుడుతూ గూడును ఏర్పాటు చేసుకుంది. ఇది చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ పక్షి ఏదో కాదు టైలర్ బర్డ్. ఈ పక్షి ఆకులనే ఇల్లుగా కట్టుకుంటుంది.
తన ముక్కుని సూదిగా ఉపయోగిస్తూ ఇక ఆకులకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ ఆ రంధ్రాల నుంచి దూదిని దారం లాగా లాగుతుంది. ఇలా మూడు నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా టైలర్ బర్డ్ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కేవలం గూడు ఏర్పాటు చేసుకోవడమే కాదు గూడు రెడీ అయ్యాక అందులో దూది ఇతరత్రా మొత్తం పెట్టి గుడ్లు పెట్టడం కూడా మొదలు పెడుతుంది. ఇలా టైలర్ బర్డ్ ఎలా తన నివాసాన్ని సూదితో కుట్టినట్లుగా ఏర్పాటు చేసుకుంటుంది అనే విషయాన్ని తెలిపే విధంగా ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.