వైరల్ : అమ్మో పాము.. ఎక్కడ దూరిందో చూడండి?
ఒక్క సారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి అనుభవమే ఎదురైంది. నాగుపాము ఆ వ్యక్తి ఉంటున్న ఇంటి ఆవరణలో కి రావడమో లేదా.. ఇంట్లోకి రావాటమో జరగలేదు ఏకంగా ఆ వ్యక్తి షూస్ లోకి వచ్చింది. పొరపాటున ఆ వ్యక్తి షూ చూడకుండా వేసుకుని ఉంటే ఎంత పని జరిపోయేదో. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇంతకీ వీడియో లో ఏముంది అంటారా.. ఏకంగా ఒక వ్యక్తి షూస్ లో నాగుపాము దాగి ఉంది. ఆ షూ కదిలించగానే పడగవిప్పి బుస కొడుతూ బయటకు వచ్చింది.
మళ్లీ ఆ పాము లోపలికి వెళ్లి దాక్కుంది. ఇక ఈ వీడియో చూసి అందరూ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఈ వీడియో అందరిలో మరింత జాగ్రత్త పెంచుతుంది. ఎందుకంటే చాలామంది షూస్ ఇలాగే క్లీన్ చేయకుండా వేసుకుంటూ ఉంటారు. లోపల ఏముంది అనే విషయాన్ని కూడా గ్రహించరు. ఇలా వేసుకుంటే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో అనే విషయాన్ని ఈ వీడియో చెప్పకనే చెబుతుంది. అయితే ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు భలే ఉంది బుజ్జిముండ అంటూ ఏకంగా ఒక క్యాప్షన్ కూడా ఇవ్వడం అందరిని మరింత ఆకర్షిస్తుంది.