వైరల్ : శవాన్ని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసారూ.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణంగా ఎవరైనా వ్యక్తి చనిపోతే ఏం చేస్తారు. చనిపోయిన వారికి ఇక సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గ్రామస్తులు మాత్రం చనిపోయిన యువకుడి మృతదేహాన్ని ఏకంగా చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి ఊపారు. ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. అయితే ఇదంతా జరుగుతుంటే పోలీసులు రాలేదా అని అంటారా. పోలీసులు వచ్చారు అక్కడే నిలబడి చూస్తున్నారు.. తప్ప ఆ గ్రామస్తులను మాత్రం అడ్డుకోలేక పోయారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.



 మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. వివరాల్లోకి వెళితే..  గుణ జిల్లాలోని కుంబ్ రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోగిపుర అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన బన్వర్ లాల్ బంజారా అనే వ్యక్తి నదిలో స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు.  ఇక కొంత మంది గ్రామస్తులు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి గ్రామస్తులు ఆ యువకుడి మృతదేహాన్ని బయటకు తీసారు.  ఇక అప్పటికే ఆ యువకుడు మరణించినట్లు గ్రామస్తులు గమనించారు. ఈ క్రమంలోనే కాస్త విచిత్రంగా ప్రవర్తించారు గ్రామస్తులు.



 ఆ యువకుడి మృతదేహాన్ని ఏకంగా తలకిందులుగా వేలాడదీసి ఒక చెట్టుకు కట్టి ఊపారు. అయితే అతని శరీరం లోకి వెళ్ళిన నీరు మొత్తం బయటికి వస్తే అతడు బతికే అవకాశం ఉంది అంటూ గ్రామస్తులు చెప్పుకొచ్చారు.  మృతదేహాన్ని కట్టి ఊపుతున్న సమయంలో గ్రామస్తులందరూ అక్కడకు చేరుకొని గుమిగూడారు. దాదాపు 30 నిమిషాల పాటు ఇలా ఊపారు. కానీ అతడు మాత్రం బ్రతకలేరు. అయితే ఇదంతా అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నట్టు చూసారు. అక్కడ ఉన్న వారు ఎవరు కూడా మాస్కు పెట్టుకోవడం గాని భౌతిక దూరం పాటించడం గానీ చేయలేదు. ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: