తల్లి ఖాతా నుంచి పబ్ జీ కోసం రూ.10 లక్షలు స్వాహా ..?
ఇక వీరు తెలిపిన వివరాల మేరకు గత నెల నుంచి పబ్జి ఆడడానికి మొబైల్ లోనే మునిగిపోయాడు అని, ఎంత చెప్పినా వినలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ఆటలో డబ్బులు తన తల్లి ఖాతా నుంచి ఇతరులకు ట్రాన్సాక్షన్ చేసినట్లు వెల్లడైంది. ఇక అందుకే మేము అబ్బాయి మందలించడంతో అతను బుధవారం సాయంత్రం ఒక లెటర్ రాసి ఉంచి ఇంటి నుంచి పారిపోయాడు అని తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు.
తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు ముంబై పోలీసులు టెక్నాలజీ సహాయంతో ఆ బాలుడి ఆచూకీ కనుగొన్నారు. సుమారుగా కొన్ని గంటలపాటు క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆ అబ్బాయిని వెతకడం కోసం వారి సమయాన్ని కేటాయించి, ఎట్టకేలకు పోలీసులు గురువారం మధ్యాహ్నం తూర్పు అంధేరిలోని మహంకాళి గుహల ప్రాంతం లో ఈ బాలుడిని అనుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రుల దగ్గరకు పంపించారు.
ఏది ఏమైనా అంత చిన్న వయసు కలిగిన అబ్బాయి, కేవలం ఆటలకు బానిసై ఏకంగా పది లక్షల రూపాయలను నాశనం చేశాడు.. తల్లిదండ్రులు ఎన్నో రోజుల పాటు కష్టపడి దాచుకున్న డబ్బును ఒకే రోజు ఇలా నీటిలాగా ఖర్చు చేస్తుంటే, యువతను దారిలో పెట్టేది ఎవరు అంటూ మరికొంతమంది తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు..? అనే విషయాలను కూడా ఆరా తీస్తే, ఎటువంటి సమస్యలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.