వైరల్ వీడియో : అమ్మో.. ఈమె తల్లేనా?

praveen
ప్రేమకు ప్రతిరూపం అమ్మ అని చెబుతూ ఉంటారు.. అసలు  తన ఊపిరినే ఇక కడుపులో పెరుగుతున్న బిడ్డకు అల్లి తొమ్మిది నెలల పాటు భారం అనుకోకుండా మోసి  నరకం లాంటి నొప్పిని సైతం అనుభవించి బిడ్డకు జన్మనిస్తూ ఉంటుంది తల్లి  ఆ తర్వాత కూడా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. ఏ కష్టం రాకుండా ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు అపర కాళిలా గా మారిపోతు ఉంటుంది తల్లి. కానీ అలాంటి తల్లే ఇటీవలే సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించింది. తల్లి అనే పదానికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించింది.

 పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ విషయంలోనే ఏకంగా కర్కశంగా ప్రవర్తించింది. ప్రస్తుతం అందరినీ సిగ్గుపడేలా చేసింది ఆ తల్లి. భర్తపై కోపాన్ని పిల్లలఫై చూపించి దారుణంగా ప్రవర్తించింది. ఏదైనా కష్టం వస్తే ఆదుకోవాల్సిన ఆ తల్లి ఏకంగా కడుపున పుట్టిన పిల్లల పాలిట కష్టం గా మారిపోయింది  పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తూ వీడియో రికార్డ్ చేసి భర్త పంపించటం మొదలుపెట్టింది. ఇక ఆ తల్లి చేసిన పనులు చూస్తుంటే ఆమె కంటే ఒక సైకో మేలు ఏమో అని అనిపిస్తూ ఉంటుంది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చిన్నారిని హింసిస్తూ 250 వీడియోలు తీసింది ఆ తల్లి. ఈ ఘటన చిత్తూరులో వెలుగులోకి వచ్చింది.

 భర్తపై కోపంతో రగిలిపోయిన ఆ తల్లి భర్తను ఏమి చేయలేక చివరికి చిన్నారి పైన  ప్రతాపం చూపించింది.  ఏకంగా కడుపున పుట్టిన బిడ్డను హింసలకు గురి చేస్తూ 250 వీడియోలను చేసింది. వీటిని భర్తకు పంపించి రాక్షసానందం పొందింది. చిన్నారి కాళ్లావేళ్లా పడుతూ బాధపడుతున్న కూడా ఎక్కడ ఆ తల్లి మనసు కరిగిపోలేదు. హింసిస్తూ నే ఉంది. ఈ పాశవిక ఘటన తమిళనాడులోని విల్లుపురం లో చోటు చేసుకున్నట్లు గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం బాధిత చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ కర్కశ తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా నిందితురాలు చిత్తూరు జిల్లాకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: