ఇప్పటికే కరోనా రకరకాలుగా ఊహించని విధంగా.. రూపాంతరం చెందుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పుడు మరో సరికొత్త గా రూపాంతరం చెందుతూ టీకాను కూడా తట్టుకొని ప్రజలను మృత్యు దేవత ఒడిలో చేరవేయడానికి కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోంది. ఇది కరోనా ఫస్ట్ , సెకండ్ వేరియంట్లు కంటే అత్యంత దారుణంగా ఉందని వైద్యులు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు ఇది దక్షిణాఫ్రికా అలాగే ఇతర కొన్ని దేశాలలో ఈ C.1.2 వేరియంట్ ను కనుగొన్నట్లు వైద్యులు వెల్లడించారు. SARS - COV - 2 యొక్క సరికొత్త వేరియంట్ అయిన C.1.2 అత్యంత ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక అంటువ్యాధి అట. ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుంది అని చెబుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీసెస్ తోపాటు క్వాజులు - నాటల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్ఫామ్ శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం మే లో మొదటిసారిగా ఈ వేరియంట్లను కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ వేరియంట్ చైనా , డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇంగ్లాండ్, మారిషస్, న్యూజిలాండ్ తోపాటు స్విట్జర్లాండ్లో కనుగొన్నారట.
పరిశోధనలో తేలిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే C.1 తో పోలిస్తే C.1.2 అత్యంత వేగంగా వ్యాపిస్తోంది అని, covid 19 ఇన్ఫెక్షన్లలో ఇది మొదటి స్థానంలో ఉందని , దక్షిణాఫ్రికాలో తెలియజేయడం జరిగింది . ఇకపోతే ప్రతినెల దక్షిణ ఆఫ్రికాలో దీని శాతం పెరుగుతోందట. మే నెలలో జీరో పాయింట్ 2 శాతం ఉండగా జూన్లో 1.6 శాతానికి పెరిగింది .ఇప్పుడు జూలై నెలలో రెండు శాతానికి పెరిగినట్లు రికార్డుల్లో తెలపడం జరిగింది..
అందుకే ఈ వైరస్ ను వ్యాపింప చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు అని , అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.