హాలీవుడ్ టాప్ హీరో కారు దొంగతనం... వాట్ ఎ ప్లాన్ ?

VAMSI
టెక్నాలజీలో పలు మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఆర్ధిక నేరాలు, దొంగతనాలు కూడా ఎక్కువైపోయాయి. వాహనాలను సార్థం ఈ మధ్య చాలా సులభంగా దొంగిలించేస్తున్నారు కేటుగాళ్లు. ఎక్కడైనా మన బైక్ లేదా కారును లాక్ చేసి వెళుతున్నా సరే ఏదో ఒక విధంగా దొంగిలిచేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా జరిగిన ఒక సంఘటన మిమ్మల్ని షాక్ అయ్యేలా చేస్తుంది. అసలు విషయానికి వెళ్తే, హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో అయిన టామ్ క్రూజ్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బెంజ్ కారును ఒక దొంగ చాలా చాకచక్యంగా ఎత్తుకెళ్లాడు. ఈ దొంగతనం ఎలా జరిగిందంటే ఈ మధ్య తెలుగులో వచ్చిన "కనులు కనులను దోచాయంటే" సినిమాలో ఎలా అయితే ఒక కారును అంత పటిష్టంగా భద్రత ఉన్న దొంగిలిస్తారో ఇటీవల ఇంగ్లాండ్ లో ఇదే విధంగా చేయడం ఒక షాక్ అని చెప్పవచ్చు. .

కాగా టామ్ ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ లో కొనసాగింపుగా వస్తున్న 7 సిరీస్ లో నటిస్తున్నాడు. షూటింగ్ ఇంగ్లాండ్ లోనే జరుగుతోంది. హీరో క్రూజ్ తన ఖరీదైన బెంజ్ కార్ లో షూటింగ్ కి వచ్చాడు. అందరిలాగే తనకు సంబంధించిన అన్ని విలువైన వస్తువులను కార్ లోనే ఉంచి షూటింగ్ కి వెళ్ళిపోయాడు. ఇదంతా పక్క నుండే గమనిస్తోన్న ఒక దొంగ క్రూజ్ అటు వెళ్ళగానే ఆ దొంగ తన తెలివితో టెక్నాలజీతో కారును అష్టకష్టాలు పడి ఎలాగోలా కార్ ను స్టార్ట్ చేశాడు. అక్కడ క్రూజ్ సెక్యూరిటీ ఉన్నా కూడా వారికి తెలియకుండా వైర్ లెస్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ సహాయంతో  తీసుకెళ్ళిపోయాడు. కాసేపటికి అక్కడ కారు లేదని గమనించిన సెక్యూరిటీ టామ్ క్రూజ్ కు విషయం చెప్పారు.

టామ్ క్రూజ్ పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరును సీసీ కెమెరాలలో చూసి షాక్ అయ్యారు. ఆయా దొంగ తెలివికి ఫిదా అయిపోయారు. అయితే ఎలాగోలా పోలీసులు కూడా ఆ కారు ను పట్టుకోగలిగారు. కానీ అందులో ఉన్న వస్తువులు మాత్రం లేవట. ఇలా పోయిన టామ్ క్రూజ్ కారు దొరికింది. టామ్ క్రూజ్ మళ్ళీ తన కారు దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: