వేరే స్త్రీతో అలా చూసి భర్తని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..

Purushottham Vinay
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో, ఒక భార్య తన భర్తను మరో మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న షాకింగ్ సంఘటన జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక హోటల్ దగ్గర పార్కింగ్ స్థలంలో ఒక మహిళ కారు వైపు వేగంగా పరిగెత్తడం కనిపిస్తుంది. ఆ మహిళ కారు వద్దకు రాగానే, ఆమె కారు లోపలి నుండి మరో మహిళను లాగి, ఆమెను బాగా కొట్టడం ప్రారంభించింది.ఇక ఆ మహిళ తన ముఖంని దుప్పట్టతో కప్పుకొని ఉంది.ఆ దుపట్టాని తొలగించడానికి అతని భార్య ప్రయత్నిస్తుంది. అలాగే ఈమె ఎవరు అని అడుగుతూ తన భర్తపై బాగా అరుస్తోంది. అయితే భర్త తన భార్యకు సమాధానం ఇవ్వలేదు కానీ తన భార్య ప్రమాదకరమైన బారి నుండి తన 'స్నేహితురాలి'ని కాపాడటానికి మాత్రం ఎంతగానో ప్రయత్నించాడు.ఇంటర్ నెట్ లో బాగా విస్తృతంగా షేర్ చేయబడుతున్న ఈ వీడియోలో, హోటల్ లోపలికి వెళ్లే ముందు పురుషుడు ఇంకా ఆ స్త్రీ కారులో కూర్చున్నట్లు చూడవచ్చు. భార్య, బహుశా అప్పటికే తన భర్తపై అనుమానం కలిగి, ఆ జంటను అనుసరించి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఆ నగరంలో ఈ దిగ్భ్రాంతికరమైన డ్రామా అనేది బాగా జరుగుతున్నప్పుడు చాలా మంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను తమ ఫోన్ల ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. ఇక అలాగే అక్కడ ఏమి జరిగిందో అనేది చూడటానికి జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇతర మహిళను కొట్టే ముందు ఆమె తన భర్తను ముందుగా ప్రశ్నించాల్సి ఉందని ఈ వీడియోపై అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు.అతడి భార్యని కూడా నెటిజనులు ఏకిపడేస్తున్నారు. తప్పు చేసిన భర్తని కొట్టకుండా ఆ మహిళని కొట్టడం ఎంతమాత్రం కరెక్ట్ అని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోని ఈ కింద వున్న ఇంస్టాగ్రామ్ లింక్ ద్వారా ఓపెన్ చేసి మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

https://www.instagram.com/p/CSgffQ4FgpV/?utm_medium=copy_link

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: