వైరల్ : స్టన్నింగ్ క్యాచ్.. చూస్తే అవాక్కే?
అతనికి ఒక కాలు లేదు అయినప్పటికీ నిరాశ చెందలేదు ఇక ఉన్న ఒక్క కాలుతో ఏకంగా బౌలింగ్ వేయడం మొదలుపెట్టాడు. ఇక ఇటీవలే ఏకంగా ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇటీవలే అదిరిపోయే క్యాచ్ కి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం అతడు పట్టిన స్టన్నింగ్ క్యాచ్ చూసి నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం జాతీయ తరహాలో వికలాంగుల క్రికెట్ పోటీ జరిగింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఈ మ్యాచ్ లకు అంపైర్ లతోపాటు థర్డ్ ఎంపైర్ కూడా ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఇక మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఒక దివ్యంగ క్రికెటర్ తనకు కాలు లేకపోయినప్పటికీ ఏకంగా కర్ర సహాయంతో బౌలింగ్ వేస్తున్నాడు. ఇలా బౌలింగ్ వేస్తున్న సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లాంగ్ రీజియన్ దిశగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ కు తగిలి బౌలర్ వైపుగా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇక కర్ర పట్టుకొని ఉన్న బౌలర్ ఏకంగా జంప్ చేసి బంతిని అందుకున్నాడు. అది కూడా కేవలం ఒంటిచేత్తో. ఇక ఆ తర్వాత వెంటనే పైకి లేచే ప్రయత్నం చేస్తుండగా సహచరుడు వచ్చి సహాయం చేశాడు. కాగా సదరు దివ్యాంగుడు పట్టిన సాహసోపేతమైన క్యాచ్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.