Video : పక్షవాతం వచ్చిన రోగిలో ఊపు తెచ్చిన బుల్లెట్టు బండి ..!

MADDIBOINA AJAY KUMAR
ప్ర‌స్తుతం తెలంగాణ జాన‌ప‌దం బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేస్తా బా పాట యూట్యూబ్ ను షేక్ చేస్తొంది. నెట్టింట ఎక్క‌డ చూసినా ఈ పాటే ద‌ర్శ‌నం ఇస్తుంది. అంతే కాకుండా ఈ పాట‌కు నెటిజ‌న్ల నుండి కూడా విశేష స్పంద‌న వ‌స్తోంది. ఎంతో మంది ఈ పాట‌కు రీల్స్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లోనే కాకుండా మోజ్ లోనూ ఈ పాట‌కు ఎక్కువ‌గా వీడియోలు చేస్తున్నారు. ఇక ఈ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసిన‌ప్ప‌టికీ జ‌న్నారం కు చెందిన ఓ పెళ్లి కూతురు పెళ్లి భ‌ర‌త్ లో స్టెప్పులు వేయ‌డంతోనే ఈ పాట‌కు మ‌రింత ఆద‌ర‌ణ ల‌భించింది. పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ రాత్రికి రాత్రే వైర‌ల్ అవ్వ‌డంతో ఇక ఎక్క‌డ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. 


దాంతో బుల్లెట్టు బండి పాట‌ను నిర్మించిన నిర్మాత పెళ్లి కూతురుకు త‌న త‌దుప‌రి పాట‌లో న‌టించే అవ‌కాశాన్ని కూడా ఇచ్చారు. ఇక పెళ్లి కూతురు త‌ర‌వాత ఓ న‌ర్సు ఆగ‌స్టు 15న వేడుక‌ల సంధ‌ర్బంగా ఈ పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. పెళ్లి కూతురు లాగే న‌ర్సు కూడా ఎంతో అందంగా స్టెప్పులు వేసి నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంది. మొద‌ట న‌ర్సు చేసిన డ్యాన్స్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చినా చాలా మంది న‌ర్సుకు స‌పోర్ట్ చేశారు. న‌ర్సు డ్యూటీలో ఉండి డ్యాన్సులు ఏంట‌ని ప‌లువురు విమర్శించినా కానీ చాలా మంది ప్ర‌శంస‌లు అంద‌టంతో పాట క్రేజ్ డ‌బుల్ అయింది.


ఇక ఇప్పుడు మ‌రో న‌ర్సు ఇదే పాట‌కు స్టెప్పులు వేసి వైర‌ల్ అవుతోంది. అయితే ఈ న‌ర్సు మాత్రం ఓ మంచి ప‌నికోసం బుల్లెట్ బండి పాట‌కు స్టెప్పులు వేసింది. ప‌క్ష‌వాతం తో ఓ పేషంట్ బాధ‌ప‌డుతున్నాడు. ఆస్ప‌త్రి బెడ్ పై ఉన్న ఆ పేషంట్ లో క‌ద‌లిక‌ల‌ను మెరుగుప‌రిచేందుకు న‌ర్సు అత‌డి ముందు డుగ్గు డుగ్గు అంటూ స్టెప్పులు వేసింది. దాంతో ఆ న‌ర్సును అనుక‌రిస్తూ ఆ పేషెంట్ కూడా త‌న చేతుల‌ను ఆడిస్తున్నాడు. పాట‌కు అనుగుణంగా న‌ర్సు స్టెప్పులు వేయ‌డంతో రోగి కూడా సంతోషంగా త‌న నొప్పిని వ్యాధిని మ‌ర‌చి చేతుల‌ను అటూ ఇటూ ఆడిస్తున్నాడు. ప్ర‌స్తుతం న‌ర్సు పేషెంట్ తో  చేసిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: