సోషల్ మీడియాలో రకరాల వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు, పక్షులకు సంబంధించినవి నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా లైక్ చేస్తారు. ఒక్క సారి చూసి వదిలిపెట్టకుండా మళ్లీ మళ్లీ చూస్తారు. ఇందులో కొన్నిఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంటాయి. ప్రస్తుతం ఓ మేకతో సెల్ఫీకి ట్రై చేసిన యువతికి గట్టి దెబ్బ తగిలింది.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కింది వీడియోలో ఆ అమ్మాయి మేకతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నిం చేస్తూ తీవ్రగాయాలపాలైంది. ఆ మేకను తాడుతో కట్టేసి ఉంది. ఆ మేక వద్ద యువతి కింద కూర్చొని మేకతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేసింది. ఆ మేక కదులుతూ అటు ఇటు తిరుగుతూ ఇబ్బందికి గురిచేస్తూ ఉంటుంది. ఆ యువతి సెల్‌ఫోన్ కెమెరా సరిగ్గా సెట్ చేస్తున్న సమయంలో ఆ మేక హఠాత్తుగా వచ్చి తన తలతో ఆ యువతి తలను గుద్దుతుంది.
ఆ యువతి నొప్పిని ఓర్చకోలేక విలవిలాడుతోంది. ఇగో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు నెటిజన్లు తెగ చూస్తున్నారు. కామెంట్స్, షేర్లు చేస్తు ఎంజాయ్ చేస్తున్నారు. నెటిజన్లు మేకను గమనిస్తూ సెల్ఫీలు దిగాలని చెబుతున్నారు. ఇంకొంత మంది మేక బలంగా పొడిచింది అంటు సైటైర్లు వేశారు. మరి కొందరు ఇదేం పిచ్చి అంటూ మందలిచ్చారు. ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఇలాగే ఉంటందని వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు. ఆ యువతి ఒక్కసారి వెనకకు చూసి ఉంటే బాగుండనేది పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఇంత సెల్ఫీ పిచ్చి ఉండకూడదని విమర్శిస్తున్నారు. సెల్ఫీ మోజులో ప్రాణాలు మీదకు తెచ్చుకోవడం ఏంటని పలువురు తిట్టిపోస్తున్నారు. అయితే గాయాలపాలైన ఆమెను గమనించిన పలువురు ఆస్పతికి తరలించారు.