పారాలింపిక్స్ లో అరుదైన సన్నివేశం.. ట్రాక్ మీదే ప్రపోస్?
ఇక మరికొన్ని సార్లు ఏకంగా క్రీడాకారులు అందరు చూస్తుండగానే మైదానంలో తాము ప్రేమించిన వ్యక్తి కి లవ్ ప్రపోజ్ చేసి సర్ప్రైస్ ఇవ్వడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. ఎంతోమంది మనసులను గెలుచుsకుంటుంది. ఇటీవలే మెగా క్రీడల పండుగ టోక్యో ఒలంపిక్స్ ముగిసింది. ప్రస్తుతం టోక్యో పారాలింపిక్స్ జరుగుతున్నాయి. ఈ పారాలింపిక్స్ లో భాగంగా ఇటీవల ఒక అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది మనసులను గెలుచుకుంటుంది.
పారాలింపిక్స్ లో భాగంగా 200 మీటర్ల పరుగు పందెంలో కేప్ వర్త్డే దేశం అంద స్పీంటర్ క్యూలా సెమీస్ వరకు వచ్చి సెమిస్ లొ ఓడిపోయింది . కానీ ఆమె జీవితంలో ఒక మధురానుభూతి మిగిలిపోయింది. ఏకంగా 200 మీటర్ల పరుగు ముగియగానే తన గైడ్ మోకాళ్ళమీద నిల్చొని స్పీంటర్ క్యూలా కు లవ్ ప్రపోజల్ చేశాడు. ఏకంగా వేలికి ఉంగరం కూడా తొడిగాడు. ఒకసారిగా ఊహించని లవ్ ప్రపోజల్ తో స్పీంటర్ క్యూల భావోద్వేగానికి గురైంది ఇక దీనిని అటు కెమెరాలు ఫోకస్ చేయడంతో స్టేడియం మొత్తం ప్రేక్షకుల కేరింతలతో ఊగిపోయింది అని చెప్పాలి.