ప్రపంచంలో ఎవ్వరూ ఇలా బైక్ డ్రైవ్ చెయ్యరేమో ?

VAMSI
జెనరేషన్స్ మారుతున్న కొద్దీ మనుషులలో అలవాట్లు, పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ జెనరేషన్ లో యువత మరీ ఎక్కువగా చెడిపోతున్నారు. అందరూ ఆలా లేరు కానీ ఎక్కువ శాతం ఇలానే ఉన్నారు. ఇంట్లో పెద్ద వాళ్ళ మాట కూడా వినకుండా వారికిష్టమొచ్చినట్టు జీవిస్తున్నారు. అందులో భాగంగానే చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు. వాటిలో ధూమపానం, మద్యపానం మరియు బైక్ రైడింగ్ వలన ఎక్కువగా యువత పెడదారి పడుతున్నారు. కాలేజీ వయసొస్తే చాలు బైక్ ఖచ్చితంగా కావాల్సిందే అంటున్నారు. తల్లితండ్రులు స్థోమత లేకపోయినా ఎలాగోలా కొనిస్తున్నారు. బైక్ ఉన్న యువకులు సరిగా నడిపితే సరే... కొత్త కొత్తగా గొప్పలకు పోయి ఫ్రెండ్స్ దగ్గర ప్రెస్టేజ్ కోసం ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. మీరు బైక్ లను నడపడంలో చాలా రకాలు చూసి ఉంటారు.
కానీ మన వీడియోలో నడుపుతున్న వ్యక్తిలాగా ఎవ్వరినీ చూసి ఉండరు. మరి అంత విచిత్రంగా ఎలా నడుపుతున్నాడో ఈ వీడియో చూసి తెలుసుకోండి. యువతకు ఆన్లైన్ లో బైక్ రేసింగ్ వీడియోలను చూడడమంటే మహా ఇష్టం. మరి ఈ వీడియోను కూడా అంతే ఇష్టపడుతారని అనుకుంటున్నాము. మీరు బైక్ నడపడంలో ఎన్నో టైప్స్ మరియు స్టైల్స్ చూసి ఉంటారు. కానీ ఇలా నడపడం ఇదే మొదటిసారి కాబోలు. ఈ వీడియోలో వ్యక్తి రివర్స్ బైక్ రైడింగ్ చేస్తున్నాడు. ఈ వీడియో ఉన్న వ్యక్తి ఒక స్కూటీలో కూర్చుని ఉన్నాడు. కానీ అతను రివర్స్ లో ఉన్నాడు. అలాగే కూర్చుని నడుపుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తూ ఉంది. కానీ ఇది ఎలా సాధ్యమో అర్ధం కావడం లేదు. మాములుగా మీరు ట్రై చేసినా ఇది చెయ్యలేరు అనుకుంటాను.
కానీ అతను ఎలా నడిపాడన్నది మిస్టరీ గా మారింది. పైగా అతను అక్కడ పరిసర ప్రాంతాల్లో రివర్స్ రైడింగ్ లోనే రౌండ్స్ వేస్తున్నాడు.  కానీ మీరు సునిశితంగా పరిశీలిస్తే ఈ వీడియోలో ఉన్న స్కూటీకి రెండు వైపులా హ్యాండిల్స్ ఉన్నట్లు అర్ధమవుతోంది. వాటితో పాటుగా బ్రేక్ మరియు క్లచ్ కూడా ఉంది అందుకే అతను ఈజీగా డ్రైవ్ చేయగలుగుతున్నాడు. అయితే రెప్ప పాటులో వచ్చే వీడియోలో మాత్రం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఎలాగయితేనేమి తనకున్న తెలివి మరియు టాలెంట్ తో అందరినీ మోసం చేయగలిగాడు, ఆలోచించేలా చేశాడు అంటూ నెటిజన్లు ఎంకరేజ్ చేస్తున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: