నవంబర్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ లలో వాట్సాప్ పని చేయదట..!

Divya
వాట్స్అప్ ఇటీవల సరికొత్త సిస్టంను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే . ఇక దీనితో పాత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పని చేయదు అని తెలుస్తోంది. మీరు కనుక ఒకవేళ పాత స్మార్ట్ ఫోన్ లను కనుక ఉపయోగిస్తున్నట్లు అయితే ఇకపై ఈ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ పని చేయదట. ఇటీవల వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది కాబట్టి పాత స్మార్ట్ఫోన్లలో పని చేయదు అని వాట్సాప్ సంస్థ తెలిపింది.
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్, ios 9, kai OS 2.5.0 వంటి మోడల్ మొబైల్స్ లో ఇకపై నవంబర్ ఒకటో తేదీ నుంచి వాట్సాప్ పని చేయదట. ఇక ఇప్పుడు సరికొత్తగా ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ios 10, జియో ఫోన్ అలాగే జియో ఫోన్ టు లలో కూడా వాట్సాప్ పని చేస్తుంది. ఇక నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరెవరు ఫోన్ లో వాట్సాప్ పనిచేయదో వారంతా గూగుల్ డిస్క్ బ్యాక్ అప్ ద్వారా మీ మెసేజ్ లను తిరిగి పొందవచ్చు. ఒకవేళ మీరు మీ ఫోన్ నుండి వాట్సాప్ ని అన్ఇన్స్టాల్ చేసినప్పటికీ మీ సందేశాలను కోల్పోకుండా ఉండాలంటే అన్ఇన్స్టాల్ చేయడానికి ముందు బ్యాక్ అప్ చేసుకోవాలి.
ఇక వాట్స్అప్ పని చేయని ఫోన్లు జాబితాను ఇక్కడ ఒకసారి చూసి తెలుసుకోండి..
1. ఆపిల్:
ఐఫోన్ ఎస్సీ మొదటి జనరేషన్, సిక్స్ ఎస్ మరియు సిక్స్ ప్లస్.
2. ఎల్ జి:
ఎల్ జి లూసిడ్ 2, ఆప్టిమస్ ఎఫ్7, ఆప్టిమస్ ఎఫ్ 5, ఆప్టిమస్ ఎల్జి 3 డ్యుయెల్, ఆప్టిమస్ ఎల్ సెవెన్, ఆప్టిమస్ ఎల్ ఫైవ్, ఆప్టిమస్ ఎల్3, ఆప్టిమస్ ఎఫ్ సిక్స్, ఆప్టిమస్  ఎల్ ఫోర్, ఆప్టిమస్ ఎల్ టు, ఆప్టిమస్ నైట్రో హెచ్డీ, ఫోర్ ఎక్స్ హెచ్ డి, ఆప్టిమస్ ఎఫ్ 3 క్యూలలో వాట్సాప్ పని చేయదు.
3. సాంసంగ్:
సామ్సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్, సాంసంగ్ ట్రెండ్ 2, సాంసంగ్ గెలాక్సీ ఎస్2, ఎస్ 3, గెలాక్సీ ఎస్ 3 మినీ, గేలక్సీ ఎక్స్ కవర్ టు, గెలాక్సీ కోర్ మోడల్స్ లో వాట్సాప్ పని చేయదు.
ఇక వీటితో పాటు సోనీ ఆల్ఫా టెల్ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లలో కొన్ని మోడల్స్ లో ఇకపై వాట్సాప్ పని చేయదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: