పారాగ్లైడింగ్ చేయడం అంటే ఎంత ధైర్య వంతులైనా వణికిపోతుంటారు. దానికి కారణం పారా గ్లైడింగ్ చేయడం అంత సులభం కూడా కాదు. ఎంతో ఎత్తు నుండి కొండల పై నుండి ధైర్యంగా కిందకు దూకాలి. పారాచూట్ ఉన్నా కూడా అంత ఎత్తు పై నుండి కొండలపై నుండి దూకాలంటే భయం వేయడం సాధారణమే. అయితే మనుషులే ఎంతో భయపడే పారాగ్లైడింగ్ ను ఓ కుక్క మాత్రం తెగ ఎంజాయ్ చేసింది. కుక్కను పెంచుకున్న యజమాని తన కుక్కతో కలిసి పారాగ్లైండింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితం కుక్కను దత్తత తీసుకున్న యజమాని దానిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కుక్క కూడా అతడితో ఎంతో సరదాగా గడుపుతుంది.
అయితే తన కుక్కకు ఓ కొత్త అనుభూతిని కల్పించాలని నిర్ణయించుకున్న యజమాని దానిని తీసుకుని పారాగ్లైండింగ్ చేశాడు. వీడియోలో ఆ వ్యక్తి వెనకాల కూర్చుని కుక్కను పట్టుకున్నాడు. ఆ కుక్క కదలకుండా ఎలాంటి భయం లేకుండా చక్కగా కూర్చుండిపోయింది. వీడియో మొదలు పెట్టాక గాల్లో తేలుతున్నప్పుడు ఆ కుక్క ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. అతడు వెనకాల నుండి దాని బొచ్చును నిమురుతున్నాడు. ఇక ప్రపంచంలో ఇప్పటి వరకూ మనుషులు పారాగ్లైండింగ్ చేశారు. గానీ జంతువులు పారాగ్లైడింగ్ చేయలేదు. దాంతో మొదటిసారి పారాగ్లైండింగ్ చేసిన కుక్కగా కూడా ఈ కుక్క రికార్డు సాధించింది. నిజానికి కుక్కతో పారాగ్లైడింగ్ చేయడం ద్వారా ఆ వ్యక్తి కూడా సాహసమే చేశాడు.
మనుషులే పారాగ్లైండింగ్ సమయంలో భయపడి అరుస్తూ ఉంటారు. అయితే కుక్క పారాగ్లైడింగ్ చేసే సమయంలో భయపడిందంటే దానిని ఆపడం చాలా కష్టం. అరుస్తూ హంగామా చేసిందంటే అంతేసంగతి. ఎక్కువగా కదిలితే కుక్క యజమాని ప్రాణానికే ప్రమాదం జరిగేది. కానీ కుక్క చక్కగా కూర్చోవడంతో అది పారా గ్లైడింగ్ ను ఎంజాయ్ చేసి యజమానికి కూడా కొత్త ఎక్స్ పీరియన్స్ వచ్చేలా చేసింది. ఇక ఈ వీడియో చూసినవాళ్లు కుక్క ధైర్యాన్ని అది ఆశ్వాదిస్తున్న విధానం చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొందరు కుక్క కూడా పారాగ్లైడింగ్ చేసింది. కానీ మాకు ఆ చాన్ష్ ఎప్పుడు వస్తుందోనని అనుకుంటున్నారు.