కొంతమంది మహానుభావులు వుంటారు. వారెంత మహానుభావులు అంటే ఒక పని మొదలు పెట్టారంటే ఇక వారికి అదే లోకం. వారి ఏకాగ్రత్త అంతా కూడా ఆ పనిపైనే పెడతారు. అందులోనే నిమగ్నమై పోతారు. ఎంతలా అంటే తమ ప్రాణాలు పోయే ప్రమాదం జరిగిన వారికేమి తెలియనంతలా. ఇక అలాంటి సంఘటన ఇక్కడ జరిగింది. ప్రస్తుతం అది నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది. ఇక అగ్ని ప్రమాదాలు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దురదృష్టకర అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక మహిళ తన జుట్టుకు మంటలు అంటుకున్నప్పుడు ఆమె చేస్తున్న భోజనం కోసం కొన్ని వస్తువులను సేకరించడానికి కిందకు వంగి కనిపిస్తుంది. ఫుటేజ్‌లో ఆమె స్టవ్ కింద ఒక రాక్‌లో నిల్వ ఉంచిన సామాగ్రిని తీసుకువస్తున్నట్టు కనిపిస్తుంది. వంటగదిలో ఉన్న మహిళ ఆమె జుట్టు మంటల్లో కాలిపోవడం ప్రారంభమైనప్పుడు ఆమెకు అసలు స్పష్టంగా తెలియదు.
ఆమె తన పనిలో ఎంతగా మునిగిపోయిందంటే, ఈ భయంకరమైన విషాదం జరుగుతున్నట్లు గ్రహించడానికి ఆమెకు దాదాపు ఒక నిమిషం పట్టింది.ఆ మహిళ వంటగదిలో తన పనులను కొనసాగిస్తోంది, ఆమె జుట్టు మండిపోతుందనే విషయం తెలియదు. జుట్టు తగలబడడం ప్రారంభమైన 45 సెకన్ల తర్వాత ఆ మహిళ తన తలపై వేడిని అనుభూతి చెందండం జరిగింది.ఇక వైరల్ అయిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆశ్చర్యపరిచింది. "ఈ మహిళ మంటల్లో ఉంది" అనే శీర్షికతో ఒక ట్విట్టర్ వినియోగదారుడు వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ ఫుటేజీని ప్రశాంత్ సాహు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు, ఇక దీనికి 14.2K ఫాలోవర్స్ ఉన్నారు. ఈ 56-సెకన్ల నిడివి గల వీడియో సెప్టెంబర్ 16 న జరిగిన ఈ భయంకర సంఘటనను చూపుతుంది.అయితే సంఘటన జరిగిన ప్రదేశం అనేది ఇంకా అస్పష్టంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ఇక మీరు ఈ వీడియో చూసి మీ స్పందన ఏంటో చెప్పండి.
https://twitter.com/suryanandannet/status/1439650620714020867?s=19