కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం..!

Divya
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఎప్పటికప్పుడు పథకాలను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాటలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఆయన చెప్పిన ప్రకారమే తెలంగాణలో జరిగింది. కులాల ప్రాతిపదికన కుటుంబాలను విభజించి ఒక్కొక్క కులానికి ఒక్కో విధంగా పథకాలను రూపొందించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హుజురాబాద్లో దళితుల నుంచి ఓట్లు రాబట్టడం కోసం దళిత బందు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఇప్పటికే హుజురాబాద్ ఎన్నికల భాగంగానే యాదవ్ కులాలకు గొర్రెల  పంపిణీ చేస్తున్నారు..ఇక ఇప్పుడు  కూడా దళిత వర్గాలు ఆర్థికంగా మెరుగుపడాలని ఆలోచనతో దళిత బంధు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న దళిత పేదలకు ఒక్కొక్కరికి  నాటు కోళ్లను అందించాలని భావిస్తోంది. దీంతో మరో సరికొత్త పథకం దళితుల కోసం రానున్నట్లు సమాచారం. పల్లె ప్రాంతాలలో నాటు కోళ్ల పెంపకం తో పేదలకు మంచి ఆదాయం రావడంతో పాటు రూరల్ ఏరియా లో న్యూట్రిషన్ లోపాన్ని కూడా అధిగమించవచ్చని ఈ పథకం ద్వారా భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తో కలిసి ఏకంగా రెండు కోట్ల నాటు కోళ్లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పథకం ద్వారా ఎన్ని కోళ్లను ఇస్తారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఇకపోతే 58 లక్షల కుటుంబాలను ఆర్థికంగా మెరుగుపరచడానికి లక్ష్యంగా చేసుకొని , ఈ పథకాన్ని తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమం కోసం 163 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోందట . ఒక్కొక్క యూనిట్ 5 కోట్లు చొప్పున ప్రతి సంవత్సరం 40 లక్షల కోట్లను ఐదు సంవత్సరాల పాటు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు ఈ కోళ్ళ ద్వారా ప్రతి సంవత్సరం 85 కోట్ల గుడ్లు, 8.5 మెట్రిక్ టన్నుల కోళ్ల మాంసం ఉత్పత్తి అవుతున్నట్లు అంచనాలు కూడా వేశారు. అంతే కాదు గుడ్ల ఉత్పత్తి తో 350 కోట్ల రూపాయలు, కోళ్ల అమ్మకాలతో 290 కోట్ల రూపాయలు మొత్తం ఆరు వందల ముప్పై కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని ప్రభుత్వం కూడా లెక్కలు వేస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: