ఈ అలవాట్లతో మెదడులో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందట..!
ముందుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.. సాధారణంగా బ్రెయిన్ టిష్యూల లోకి ఆక్సిజన్ లేదా పోషక పదార్థాలు వెళ్ళ లేని సమయంలో ఆ ప్రదేశంలో రక్తం గడ్డ కట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ టాబ్లెట్స్ వల్ల కొంచెం రిజల్ట్ ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఏ సమయంలో ఎలాంటి ఆపద వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడతాయి.కాబట్టి ఇలాంటి వాటిని మీరు కూడా తీసుకున్నట్లయితే వెంటనే నిలిపి వేయడం మంచిది.
జీవనశైలిలో మార్పుల కారణంగా కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారంలో సరైన పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. చాలామంది ధూమపానం, మద్యపానం వంటివి చేస్తూ రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆడ , మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మోకింగ్ చేస్తున్నారు కాబట్టి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్రెయిన్ స్ట్రోక్ బారినపడే ప్రమాదం ఉంటుంది.