డ్రగ్స్ ఇంత ప్రాణాంతకమా..ఇక మెదడు పై ప్రభావం తెలిస్తే..!!

Divya
అప్పట్లో నల్లమందు, పొగాకు వంటి మాదకద్రవ్యాలకు ప్రజలు బాగా బానిసలయ్యేవాళ్ళు .. కానీ ఈ మధ్య కాలంలో అత్యధికంగా ధనవంతుల పిల్లల డ్రగ్స్ పేరిట దొరికే మాదక ద్రవ్యాలకు బాగా బానిస అవుతున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని మొదలుకొని బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వరకు ఈ మధ్య చాలామంది బడాబాబుల తో పాటు వారి పిల్లలు కూడా ఈ డ్రగ్స్ కి బానిసలవుతున్నారు. అంతేకాదు కేసుల్లో ఇరుక్కుని కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ..ఉన్న పరువును కూడా పోగొట్టుకుంటున్నారు. ఇకపోతే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
తాజాగా బాలీవుడ్ లో  ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారం ఒక సంచలనం రేపుతోంది.. ఈ క్రమంలో ని ఎక్కడ చూసిన డ్రగ్స్ కి సంబంధించిన వార్తలు వినపడుతూ ఉండడం గమనార్హం.. ఇక ఈ విషయాన్ని మనం పక్కన పెడితే డ్రగ్స్ తీసుకోవడం వలన మన శరీరం పై ఎలాంటి ప్రభావం కలుగుతుంది.. ఇక ఈ విషయం పై నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం..
తాజాగా జరిపిన సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు ఈ డ్రగ్స్  ఎక్కువగా తీసుకోవడం వల్ల మరణిస్తున్నారు అని ప్రతి సంవత్సరం ఏకంగా ఏడు మిలియన్లకు పైగా ప్రజలు ఈ డ్రగ్స్ వల్ల మరణిస్తున్నారని అధ్యయనం తేల్చింది.. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మొదట మెదడు పై దాని ప్రభావం పడుతుందట.. ఒక మనసు నియంత్రణ కోల్పోవడం, ప్రపంచంలో తేలియాడుతున్న అనుభూతి మనకు కలుగుతుందట.. ఇలా కలగడానికి గల కారణం ఏమిటంటే ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటామో అప్పుడు మెదడులో ఉండే ట్రాన్స్మీటర్ విడుదల అవుతుంది.. దీనివల్ల మెదడు తన క్రమమైన పనితీరును కూడా మరచి, ఆనందం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది..
డోపమైన్ విడుదలవుతుందో వేరొక ప్రపంచంలో తేలియాడుతున్న అనుభవం కూడా కలుగుతుందట.. ఇక ఫలితంగా మెదడులో ఉండే ఇతర నరాలు తమ కార్యాచరణను కోల్పోతాయి.. ఒక్కసారి తీసుకుంటే పదేపదే తీసుకోవాలనే ఆకాంక్ష మనలో కలుగుతుందట. రోజువారి కార్యకలాపాన్ని ప్రభావితం చేస్తూ చీకటిలోకి నెట్టివేస్తుంది.. ఇందులో మెథాంఫేటమిన్ అనే డ్రగ్ చాలా ప్రమాదకరమైనది.. ఇందులో ఉండే కొకైన్ మెదడుకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగించి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందట.. రోగనిరోధక శక్తి కోల్పోవడం, కడుపు నొప్పి, తక్కువ ఆకలి, వికారం, బరువు తగ్గడం, పక్షవాతం , బలం కోల్పోవడం వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: