డస్ట్‌ బిన్‌లో లో పడేయబోయిన రాయి ..ఖరీదు 24 కోట్లు !!!

Surya
వీధి వీధి తిరిగి అమ్మేవాళ్ళ దగ్గర , ఫ్లాట్ ఫేమ్ పై అమ్మేవాళ్ళదగ్గర అనేక  వస్తువులు చాల చౌకగా లభిస్తూవుంటాయి వాటిని సరదాకొనమనో లేక తక్కువరేటు కు దొరుకుతున్నాయనో  మనం వాటిని కొనేస్తూవుంటాం. అయితే ఒక్కోసారి ఆ వస్తువులు వూహించనివిధంగా ఒరిజినల్ వస్తువులుగా లభిస్తూ ఉంటాయి . అలాంటి వస్తువులు మనకు లభిస్తే ఎగిరి గంతేసేంత పనిచేస్తాం. అలంటి వస్తువు విలువ కోట్లలో  ఉంటుందంటే మన సంతోషానికి అవధుల్లేకుండా పోతాయి. అలంటి కోట్లు ఖరీదు చేసే ఓ డైమండ్ ఓ బామ్మ కు లభించింది. ఇప్పుడు దానివిలువ అక్షరాలా 24 కోట్లు.



 పూర్తి వివరాలలోకి వెళితే యుకె కి చెందిన 70 సంవత్సరాల బామ్మ కొంత కాలం క్రితం కారులో రకరకాల వస్తువులను తీసుకువచ్చి అమ్మేవారి దగ్గరనుండి ఓ నకిలీ డైమెండ్ రింగ్ ని ముచ్చటపడి కొనుక్కుంది. కానీ అమ్మినవారి వివరాలు ఆమెకు కచ్చితంగా తెలియవు .అయితే కాలక్రమంలో ఆ వస్తువుపై మోజు తగ్గడంతో దాన్నికాస్త అటకపై పడేసింది. ఈ క్రమంలోనే పాతవస్తువులను చేత బుట్టలో పడేసే క్రమంలో ఆ డైమండ్ రింగ్ ని పడేసే పనిలో పడింది. అదిగమనించిన ఇరుగుపొరుగు వారు ఆ వస్తువు చూడడానికి మాములు వస్తువుల కనబడడం లేదు కనుక దానిని ఒకసారి పరీక్షించవలసిందిగా ఆ బామ్మకు సలహా ఇచ్చారు .




అయితే ఆ బామ్మకు కూడా అనుమానం కలగడంతో వెంటనే  నార్త్ టైన్‌సైడ్‌లో నార్త్ షీల్డ్స్‌లోని ఫీటన్‌బై వేలం పాటదారుల దగ్గరకు తీసుకు వెళ్ళింది. అయితే నార్త్ టైన్‌సైడ్‌లో నార్త్ షీల్డ్స్‌లోని ఫీటన్‌బై వేలం సంస్థకు చెందిన అధికారిని  మార్క్ లైన్  వివరిస్తూ ..70 ఏళ్ళ వయసున్న ఓ బామ్మ డైమండ్ రింగ్ ని ఓ హ్యాండ్ బ్యాగ్ లో తీసుకుని వచ్చింది . ఆ రాయిని పరీక్షించినప్పుడు దాదాపుగా ఒక ఫౌండ్ నాణెం కంటే పెద్దరాయివలె ఉంది. డైమండ్ టెస్టర్ తో పరీక్షించే వరకు తాము గుర్తించలేక పోయాం . అంతే కాకుండా బెల్జియం లో అంటేవేర్స్ లోని నిపుణుల బృందంతో ద్రువీకరించినట్లు ఆమె తెలిపింది. అయితే వారు తెలిపిన వివరాలప్రకారం 34 క్యారట్ల డైమండ్ విలువ రూ. 24 కోట్లుగా నిర్ధారించారు. ఈ డిమాండ్ ను నవంబర్ 30 వేలం వేయనున్నట్లు తెలిపారు. అప్పటివరకు ఈ డైమండ్ ని లండన్‌లోని డైమండ్ క్వార్టర్ హాటన్ గార్డెన్స్‌లో  సురక్షిత ప్రదేశం వద్ద  ఉంచనున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: