వైరల్ : ఈ వీడియో చూస్తే మళ్ళీ టపాకాయలు కాల్చరు?
అయితే ఇలా టపాకాయలు కాలుస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఇలా టపాకాయలు కాలుస్తూ ఉన్న సమయంలో ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయ్. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆస్పత్రుల పాలు కూడా అవుతున్నారు. అయితే టపాకాయలు కాలుస్తూ ఉన్న సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు కూడా సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు టపాసులు కాలుస్తూ ఉన్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తూ ఉంటారు. అయితే ఇలా టపాకాయలు కాలుస్తూ ఉన్న సమయంలో కొన్నిసార్లు ఏకంగా భారీగా విస్పోటనం చెంది ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
టపాకాయలు కాలుస్తూ ఉన్న సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనే విషయానికి నిదర్శనంగా ఇటీవలే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో లో భాగంగా నలుగురు పిల్లలు ఇంటి బయట టపాకాయలు కలవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే అగ్గిపెట్టతో దానిని వెలిగించగానే పెద్ద మంట వస్తుంది. ఇక చుట్టూ గుంపుగా ఆ పిల్లలందరికీ కూడా మంట ఒక్కసారిగా అంటూకున్నంత పని అయింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆ పిల్లలు అక్కడి నుంచి పరుగులు పెడతారు. ఇక ఇంట్లో నుంచి పెద్దలు వచ్చి భారీగా మంటలు వస్తూ ఉండడం చూసి షాక్ అవుతారు. ఒక వ్యక్తి ఏకంగా ఆ మంటలపై నీళ్లు చల్లినప్పటికీ ఆ మంటలు మాత్రం చల్లార లేదు. ఇక ఈ వీడియో చూసి ఇప్పటికైనా టపాకాయలు కాల్చటం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నెటిజన్లు..