వైరల్ : టీచర్ ను ఇలా చేస్తారా?

praveen
ఉపాధ్యాయుడంటే ప్రతి ఒక్కరి జీవితానికి మార్గ దర్శిగా నిలుస్తాడు.. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరికి జీవితాన్ని ఇస్తూ ఉంటాడు. ఎదుగుతున్న వయసులో మంచి జరగాలని కోరుతూ ప్రతి ఒక్కరిని ప్రయోజకులను చేయడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇలా ప్రస్తుతం మహామహులుగా కొనసాగుతున్న వారు ఒకప్పుడు ఎంతో మంది ఉపాధ్యాయుల శిక్షణ లో రాటుదేలిన వారే కావడం గమనార్హం. అందుకే తల్లి తండ్రి తరువాత దైవం గురువే అని చెబుతూ ఉంటారు.


 ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ వృత్తికి ఎంతగానో గౌరవం ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు  ఉపాధ్యాయుడు కనిపిస్తే ఎంతో వినయంగా నమస్కారం పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారూ. కేవలం చదువుకున్నప్పుడు మాత్రమే కాదు చదువుకుని బయటికి వెళ్లిపోయిన తర్వాత ఒకప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కనిపిస్తే  ఎంతో వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేటి రోజుల్లో మాత్రం చాలా మంది విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల కనీస గౌరవం కూడా చూపించడం లేదు.ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే ఒక ఉపాధ్యాయుడు విషయంలో విద్యార్థులు ఎంత దారుణంగా ప్రవర్తించటం ఏంటి అంటూ అందరూ నోరెళ్ళబెడతారు అని చెప్పాలి.



 కర్ణాటక రాష్ట్రంలోని దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయుడి పట్ల ఎంతో అవమానీయంగా ప్రవర్తించారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాగానే క్లాస్ లో ఉన్న విద్యార్థులు గుట్కా ప్యాకెట్ తింటున్నట్లుగా గమనించాడు విద్యార్థులు. ఇలా చేయవద్దు అంటూ ఉపాధ్యాయుడు మంచి మాటలు చెప్పాడు. టీచర్ చెప్పిన మంచి మాటలు అటు విద్యార్థులకు ఆగ్రహం తెప్పించాయి.. ఈ క్రమంలో నలుగురు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుని చుట్టుముట్టి  ఏకంగా డస్ట్ బిన్ తలపై  వేశారు. అయితే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుంది అనే ఉద్దేశంతో ఆ మాస్టారు కనీసం ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: