మనుషులు అవసరాలను తీర్చుకొవడానికి దొంగతనం చేయడం విన్నాము. ఇక కొందరు పని లేక దొంగలు మారారు. కానీ రెండు జంతువులు దొంగతనాలు చెయ్యడం ఎప్పుడైనా చూశారా? అవును మీరు విన్నది నిజమే.. కోతి దొంగతనం చేస్తుంటే అందుకు కుక్క సాయం చేసింది..ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఎంతో తెలివిగా అవి చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు.
బద్ద శత్రువులు గా ఉండే ఈ రెండు ఇలా చేశాయి అంటే నమ్మకం కలుగలేదు కధూ.. ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. వివరాల్లొకి వెళితే.. ఈ ఫన్నీ సంఘటన మహారాష్ట్ర లో వెలుగులోకి వచ్చింది. ఓ దుకాణం దగ్గరకు వచ్చిన కోతి కుక్క అక్కడ ఉన్న చిప్స్ ప్యాకెట్ ను తీసుకొనే ప్రయత్నం చేశాయి. కుక్క కింద సపోర్ట్ గా ఉంటె పైన కోతి నిలిచి ఆ ప్యాకెట్ కోసం చాలా సార్లు ట్రై చేసింది. మొత్తానికి సాధించింది.
ఈ ఘటన జరిగి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు ఇది వైరల్ కావడం తో వెలుగులోకి వచ్చింది. తిండి కోసం వాళ్ళు పడిన నిజంగా అందరినీ నవ్విస్తుంది. కొంతమంది మాత్రం జాలి చూపిస్తున్నారు. మొత్తానికి ఈ రెండు కూడా సోషల్ మీడియా స్టార్ లు అయ్యాయి. ఇది ఇలా ఉండగా ఇటీవల ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక కోతి పిల్లను కుక్కలు చంపాయని ఏకంగా 300వరకు కోతులు కుక్కలను చంపి పగ తీర్చుకున్నాయి. ఇది నిజంగా ఎదురు పోరాటం అనే చెప్పాలి. దెబ్బకు దెబ్బ అంటూ సినిమా స్టైల్ లో పగ తీర్చుకున్నాయి. ఈ వీడియో ను చూస్తె మాత్రం కోతి, కుక్క మంచి స్నేహితులు అని భావిస్తారు. ఇక ఆలస్యం లేకుండా మీరు కూడా ఆ వీడియో ను చూసి కాసేపు నవ్వుకోండి.