సాధారణంగా ఒక కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్యన ప్రేమ, అనురాగం, బంధాలు ఉంటాయి. కానీ అవి సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుంటాయి. అయితే ఇక్కడ భార్య భర్త కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. భర్తలు భార్యల విషయంలో జర భద్రంగా ఉండాలి మరి....ఈరోజుల్లో భార్యలు బర్త్ డే మర్చిపోయినా సరే భర్తకు జైలు శిక్షే గతి. అదేంటి సాధారణంగా భార్య పుట్టిన రోజు మరచిపోతే బయట అలకలు, విసుర్లు ఉంటాయి. కానీ ఇదే చోద్యం అనుకుంటున్నారా...!!! ఇది మన దేశంలో కాదు లేండి..వివరాల్లోకి వెళితే.. ప్రపంచ దేశాలలో ప్రాంతాలను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోరకమైన చట్టాలు, న్యాయ వ్యవస్థలు, నిబంధనలు.
అయితే కొన్ని దేశాలలోని చట్టాలు మనకు వింతగాను, విచిత్రంగానూ ఉంటాయి. వాటిని విన్నప్పుడు ఆశ్చర్యంతో ఔరా అనాల్సిందే. అలాంటి న్యూసే ఇది. పసిఫిక్ మహాసముద్రం, పాలినేషియన్ ప్రాంతంలోని సమోవా ద్వీపంలో ప్రసిద్ధి చెందిన దేశం అది. అయితే ఈ దేశం విచిత్రమైన చట్టాలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. సమోవా చట్టం ముఖ్యంగా భర్తలను కంట్రోల్ లో పెడుతుంది. పురుషులకు కాస్త వ్యతిరేకమనే చెప్పాలి. భర్తలు చేసే చిన్న చిన్న పొరపాట్లకు కూడా ఇక్కడి ప్రభుత్వం శిక్ష వేస్తుంది, జైలుకు పంపుతుంది. ఈ దేశ నిబంధనల ప్రకారం .. భర్త కనుక ఒకవేళ భార్య పుట్టినరోజును మరచిపోయాడు అంటే అది ఇక్కడ పెద్ద నేరంగా పరిగణిస్తారు.
ఇంకేముంది భార్యకు కనుక కోపం వచ్చిందంటే అలా ఫిర్యాదు చేస్తే ఇలా భర్తలు జైలుకి వెళ్లాల్సిందే. సమోవాలో భార్య బర్త్ డే మర్చిపోయిన భర్తకు మొదట వార్నింగ్ వచ్చి మళ్ళీ రిపీట్ అయితే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందేనట. అయితే ఈ చట్టంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేం న్యాయం రా బాబు అంటూ అవాక్కవుతున్నారు. ఇదే విధముగా మన దేశంలో పెడితే ఇంకేముంది భర్తలను జైల్లో పెట్టడానికి జైళ్లు సరిపోవేమో?