దారుణం! కన్నబిడ్డను ఎలుగుబంటి బోనులో విసిరిన తల్లి!

Purushottham Vinay
ఈ విశ్వంలో ప్రాంతం,జాతి ఇంకా బాషకు అతీతంగా ఉండేది తల్లి ప్రేమ ఒక్కటే అని చెబుతుంటారు. ఏ తల్లి అయినా కాని తన కన్న బిడ్డ క్షేమం కోసం తెగ ఆరాటపడుతుంటుంది. అందుకోసం తన ప్రాణాలను సైతం ఆమె పణంగా పెడుతుంది.బిడ్డను కాపాడటం కోసం ఎంతటి కష్టాన్నైనా సరే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తూ వారికోసం అనుక్షణం పరితపిస్తుంటుంది. కానీ ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఓ తల్లి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. రక్షించాల్సిన కన్న తల్లే, తన కూతురు పాలిట యముడిగా మారింది.తన కన్నబిడ్డను ఏకంగా ఎలుగుబంటికి ఆహారంగా ఆమె విసిరేసింది. ప్రస్తుతం ఈ షాకింగ్‌ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లోని జూకి ఒకావిడా తన మూడేళ్ల కన్న బిడ్డతో వచ్చింది. ఎలుగుబంటి ఉండే ఓపెన్‌ ఎన్‌క్లోజర్‌ వద్ద ఆమె నిల్చొని ఎలుగుబంటిని చూపించసాగింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆ చిన్నారిని పైకెత్తి ఎలుగుబంటి ఉన్న చోట ఆమె విసిరేసింది. దీంతో ఒక్కసారిగా పక్కన ఉన్నవారంతా కూడా బిగ్గరగా అరిచారు. 


ఈ విషయం తెలసుకున్న వెంటనే జూ నిర్వాహకులు సంఘటన స్థలానికి చేరుకోవడం అనేది జరిగింది.ఇక క్షణాల్లో ఆ ఎలుగుబంటిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి ఆ చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఆ చిన్నారి చిన్న గాయాలతో ఆ ప్రమాదం నుంచి బయటపడింది.ఇక ఈ సంఘటనంతా కూడా అక్కడే ఉన్న ఓ సిసిటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఆ వీడియోలో చూస్తుంటే ఆ తల్లి ఉద్దేశపూర్వకంగానే తన బిడ్డను అందులోకి విసిరేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.ఇక ఈ వీడియో చూసిన కొందరు ఆ తల్లిని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఓ కన్న తల్లి బిడ్డను ఇలా చేయడం ఏంటి అంటూ తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహా తల్లిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ నేరం కనుక నిజంగా రుజువైతే ఆమెకు 15 ఏళ్లు శిక్ష పడే అవకాశాలు  కూడా ఉన్నట్లు అక్కడున్న అధికారులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: